Site icon NTV Telugu

Jana Reddy : రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్‌ని పరుగులు పెట్టిస్తుంది

Jana Reddy

Jana Reddy

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాహుల్‌ గాంధీతో ప్రముఖులు, ప్రజలు నడుస్తున్నారు. పాదయాత్ర తమలో నూతనోత్సాహాన్ని నింపిందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. అయితే.. నిన్న రాత్రి జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో బస చేసి రాహుల్‌ ఈ రోజు ఉదయం అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. ఈ రోజు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర కాంగ్రెస్ ని పరుగులు పెట్టిస్తుందన్నారు.
Also Read : Kaloji Health University : నేటి నుంచి ఎంబీబీఎస్‌ తొలి విడత ప్రవేశాలు

ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఏకం చేస్తుందన్నారు జానారెడ్డి. ప్రస్తుత తెలంగాణలో రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తుందని జానారెడ్డి విమర్శించారు. ఇలాంటి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, నాయకుల మధ్య విభేదాలు కొంత ఉన్న.. ఊహించుకునే విభేదాలు ఎక్కువ అని జానారెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే.. తనతో పాదయాత్రలో పాల్గొన్న జానారెడ్డిని వెళ్లి కారులో కూర్చోవాలని రాహుల్‌ కోరారు. దీంతో జానారెడ్డి రాహుల్‌గాంధీ కారులో కూర్చొని ప్రయాణించారు.

Exit mobile version