Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాకిస్థాన్ అనుమానిత డ్రోన్ల చొరబాటు కలకలం రేపుతోంది. తాజాగా రామ్‌గఢ్ సెక్టార్‌లోని కేసో మహాన్సన్ గ్రామం సమీపంలో డ్రోన్లు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్స్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, పూంచ్ జిల్లాలోని డేగ్వార్ గ్రామం మీద కూడా డ్రోన్ లాంటి వస్తువు కనిపించింది. దాదాపు 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. సాయంత్రం 7.30 గంటల సమయంలో గుర్తించిన ఈ డ్రోన్స్‌ను నిర్వీర్యం చేయడానికి భారత సైన్యం కాల్పులు జరిపింది. భద్రతా బలగాలు అప్రమత్తమై.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
READ MORE: Anil Ravipudi: నయనతార ఒప్పుకోకపోతే ఆ సినిమా చూసి పడుకుంటానన్నా!
గత కొన్ని రోజులుగా సరిహద్దు అవతల నుంచి లోయ ప్రాంతంలో డ్రోన్స్ ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి. ఈ పరిణామాలపై మంగళవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందించారు. డ్రోన్ల కదలికల విషయంలో పాకిస్థాన్‌ను “అలర్ట్” చేశామని స్పష్టం చేశారు. పశ్చిమ సరిహద్దులో భద్రతా సవాళ్లను ఎదుర్కొనే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని చెప్పారు. వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడిన జనరల్ ద్వివేది, డ్రోన్ ఘటనలపై మంగళవారమే పాకిస్థాన్‌తో డీజీఎంఓ స్థాయి చర్చలు జరిగాయని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల కనిపించిన డ్రోన్ కదలికలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. పాకిస్థాన్ తమ డ్రోన్లను నియంత్రించాలని స్పష్టంగా చెప్పామని తెలిపారు. భారత సైన్యం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎలాంటి దురుద్దేశపూరిత చర్యలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. ఇటీవల కనిపించిన డ్రోన్లు చిన్నవిగా ఉండి, సరిహద్దు అవతల భారత కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగిస్తున్న రక్షణాత్మక డ్రోన్లుగా అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయినా.. పాకిస్థాన్ ముర్ఖంగా ప్రవర్తిస్తోంది.
READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని హత్యలు.. మరో హిందువు ప్రాణాలు తీశారు..
