Site icon NTV Telugu

India-Pak War : జమ్మూలో పేలుళ్లు.. సైరన్ లు వినిపిస్తున్నాయి : సీఎం ఒమర్ అబ్దుల్లా

Oamr

Oamr

India-Pak War : దాయాది పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలోనే శ్రీ నగర్ లో లైట్లు ఆర్పేసి బ్లాకౌట్ నిర్వహించడానికి సైనికులు నిర్ణయించారు. ఇదే విషయం ప్రజలకు చెప్పడానికి మసీదు లౌడ్ స్పీకర్లను ఉపయోగించారు. ‘జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. శ్రీ నగర్ లో మొత్తం బ్లాకౌట్. కానీ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. బహుషా భారీ ఫిరంగిదళాలు కావచ్చేమో. నేను ఉన్న చోట నుంచి ఈ రకమైన శబ్దాలు వినిపిస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చారు.

Read Also : Pawan Kalyan: పదవి ఉన్నంతకాలం.. నా జీతం మొత్తం మీకోసమే!

ఇంకో పోస్టులో ఆయన చీకటిలో ఉన్న ఫొటోను కూడా పోస్టు చేశాడు. దానికి ఇలా రాసుకొచ్చాడు. “జమ్మూ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి వీధుల్లోకి రాకుండా దూరంగా ఉండండి. ఇంట్లో లేదా మీరు హాయిగా ఉండగలిగే దగ్గరి ప్రదేశంలో ఉండండి. పుకార్లను పట్టించుకోవద్దు. దయచేసి ఎవరూ ఫేక్ ప్రచారాన్ని ప్రచారం చేయొద్దు మనమందరం కలిసి దీన్ని అధిగమిద్దాం’ అంటూ రాసుకొచ్చారు. ఇక భారత్ మీద పాక్ డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ బలంగా తిప్పికొడుతోంది.

Read Also : India-Pak War : నిత్యవసర సరుకులపై ఆందోళన వద్దు.. కేంద్ర కీలక సూచన

Exit mobile version