NTV Telugu Site icon

Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!

Road Accident

Road Accident

Jammu and Kashmir Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల వాహనం లోయలో పడి ఎనమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని బుజ్తలా బొనియార్‌ ప్రాంతం వద్ద ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read: Budget 2024 : యువతకు ఉపాధి, పేదల సామాజిక సంక్షేమం, మహిళల పట్ల గౌరవం వీటన్నింటిపై దృష్టి

జమ్మూలోని కిష్త్వార్‌లోని మార్వాన్ ప్రాంతంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పనుల్లో ఉన్న స్నో కట్టర్‌ మిషన్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.