NTV Telugu Site icon

Jammu And Kashmir Polls: తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది అభ్యర్థులు పోటీ!

Jammu And Kashmir Polls

Jammu And Kashmir Polls

Jammu And Kashmir Assembly Polls 2024: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 జమ్మూ డివిజన్‌లో, 16 కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి. 415 మంది అభ్యర్థుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు నేడు తేల్చనున్నారు.

5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దయిన తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. జమ్మూ డివిజన్‌లోని 24 అసెంబ్లీ స్థానాల్లో హిందూ మెజారిటీ జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, ఉదంపూర్‌లలో ఓటింగ్ జరుగుతోంది.

Also Read: Dussehra 2024: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా?.. పోలీసుల హెచ్చరికలు ఇవే!

415 మంది అభ్యర్థుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్ బేగ్ ఉన్నారు. కీలక అభ్యర్థుల్లో పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సజ్జాద్ లోన్, నేషనల్ పాంథర్స్ పార్టీ ఇండియా అధ్యక్షుడు దేవ్ సింగ్ తదితరులు ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అక్టోబరు 5న విడుదలవుతాయి. ఇక అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

 

Show comments