యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నేటి నుంచి చర్చ జరుగుతుంది. మరోవైపు ముస్లిం సంస్థలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ.. యూసీసీ బిల్లు వివక్షాపూరితమైంది.. షరియత్‌కు విరుద్ధమైన ముస్లిం సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు. షెడ్యూల్డ్ తెగలను బిల్లు పరిధి నుంచి తప్పించగలిగితే, ముస్లిం వర్గానికి ఎందుకు మినహాయింపు ఇవ్వలేరని ఆయన ప్రశ్నించారు.
Read Also: SAT20 League 2024: బార్ట్‌మన్ సంచలన బౌలింగ్.. ఫైనల్ చేరిన సన్‌రైజర్స్!
ఇక, షరియత్‌కు విరుద్ధమైన ఏ చట్టాన్ని మేము అంగీకరించము అని జమియత్ ఉలేమా-ఏ- హింద్ అధినేత మౌలానా అర్షద్ అన్నారు. ఏ మతానికి చెందిన వారైనా తన మతపరమైన కార్యకలాపాల్లో ఎలాంటి అనవసరమైన జోక్యాన్ని సహించలేరు.. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ బిల్లులో రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు కొత్త చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.. కానీ, ముస్లీంలకు మాత్రం అలాంటిది ఇవ్వలేదన్నారు.. ఇక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వారి హక్కులను పరిరక్షించారని మౌలానా అర్షద్ మదానీ కోరారు.
Read Also: Kriti Sanon: చిట్టిపొట్టి దుస్తుల్లో కేకపుట్టిస్తున్న కృతిసనన్…
అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం మతపరమైన స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని మదానీ ప్రశ్నించారు. ఈ రెండు ఆర్టికల్స్ పౌరుల ప్రాథమిక హక్కులను గుర్తించడం ద్వారా స్వేచ్ఛకు సంబంధించినది.. కానీ, ఈ యూనిఫాం సివిల్ కోడ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందన్నారు. బిల్లులోని చట్టపరమైన అంశాలను మా న్యాయ బృందం సమీక్షిస్తుంది.. ఆ తర్వాత చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇక, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మంగళవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పౌరులందరికీ వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి వంటి విషయాలపై ఏకరూప చట్టాన్ని అందిస్తుంది. ఇది బహుభార్యత్వం, ‘హలాలా’ వంటి అభ్యాసాలను నేరపూరిత చర్యగా పరిగణిస్తుంది. యూసీసీ బిల్లును ఆమోదించడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తుంది.