Anderson-Broad: అండర్సన్-బ్రాడ్ జోడీ అదిరిపోయే రికార్డు.. 1000 వికెట్లతో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఆ జట్టు బౌలింగ్‌లోనూ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పేస్ జోడీ జేమ్స్ అండర్సన్- స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో సంయుక్తంగా 1000 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జంటగా చరిత్రకెక్కింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనత సాధించింది. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బౌలర్ల జంటగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా దిగ్గజ ద్వయం గ్లెన్ మెక్‌గ్రాత్- షేన్ వార్న్ 1000 వికెట్ల రికార్డు నెలకొల్పారు. మెక్‌గ్రాత్- స్పిన్నర్ షేన్ వార్న్ 104 టెస్టు మ్యాచ్‌ల్లో కలిసి సంయుక్తంగా 1001 వికెట్లు పడగొట్టి ఆండర్సన్- బ్రాడ్ జంట కంటే ముందుగా ఈ ఘనత సాధించారు.
Also Read: INDvsAUS 2nd Test: ఖవాజా ఫిఫ్టీ.. లంచ్ బ్రేక్ సమయానికి ఆసీస్ 94/3
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
కివీస్‌తో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో అండర్సన్ రెండు వికెట్లు తీయగా.. బ్రాడ్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, రెండో రోజు మొదటి సెషన్లో బ్రాడ్ నైట్ వాచ్‌మన్ నీల్ వాగ్నర్ వికెట్ పడగొట్టాడు. దీంతో అండర్సన్- బ్రాడ్ జంట 1000 వికెట్ల క్లబ్లో చేరింది. ఇక అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో టాప్-5 వికెట్ టేకర్ల జాబితాలో కొనసాగుతున్నారు. 178 టెస్టుల్లో 40 ఏళ్ల అండర్సన్ 677 వికెట్లు పడగొట్టగా.. 36 ఏళ్ల బ్రాడ్ 160 మ్యాచ్‌లలో 567 వికెట్లు తీశాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు, షేన్ వార్న్ ఖాతాలో 708 వికెట్లు ఉన్నాయి. భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. మౌంట్ మాంగనీయ్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో ఇంగ్లండ్ 325/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. కివీస్ 306 రన్స్ చేసి ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 19 రన్స్ లీడ్ లభించింది.
Also Read: John Wich 4: ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!