NTV Telugu Site icon

Rajasthan : మహిళ పై లైంగిక దాడి.. పోలీసులు అరెస్ట్.. బాత్ రూం కెళ్లి ఆ పార్టు కోసుకున్న నిందితుడు

New Project (54)

New Project (54)

Rajasthan : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో లైంగిక దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపరచకముందే.. నిందితుడు తన ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అర్జెంట్ గా వెళ్లాలని బాత్ రూంకు వెళ్లాడు. ఆ తర్వాత బాత్‌రూమ్‌ గడియపెట్టుకుని రేజర్ బ్లేడ్‌తో తన ప్రైవేట్ పార్టును కోసుకున్నాడు. కోసుకుని కేకలు వేయడంతో విన్న పోలీసులు బాత్‌రూమ్‌ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపలి దృశ్యం చూసి పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడు బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

గాయపడిన నిందితుడిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం గాయపడిన నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. విషయం పోఖ్రాన్ ప్రాంతానికి సంబంధించినది. ఇక్కడ ఆదివారం అర్థరాత్రి, 35 ఏళ్ల అబ్దుల్ రషీద్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోకరన్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ కేసు నమోదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు అతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.

Read Also:Andhra Pradesh: కోతగా ప్రమాణస్వీకారం చేయునున్న మంత్రులు వీరే.. (వీడియో)

సోమవారం ఉదయం నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు సన్నాహాలు ప్రారంభించారు. తర్వాత బాత్ రూంకి వెళ్లాలని చెప్పాడు. పోలీసులు అతనికి పర్మీషన్ ఇచ్చారు. వెంటనే బాత్రూంకి వెళ్ళాడు. రేజర్ బ్లేడుతో తన ప్రైవేట్ భాగాలను కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాయపడిన నిందితుడు కేకలు వేయడంతో పోలీసులు తలుపు తెరవమని అడిగారు. అతను తలుపు తెరవలేకపోయాడు. దీంతో పోలీసులు బాత్‌రూమ్‌ తలుపులు పగులగొట్టారు. బాత్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో నొప్పితో మూలుగుతూ పడి ఉన్న అబ్దుల్‌ను వారు గుర్తించారు. అతని శరీరం నుండి రక్తం కారుతోంది.

పోలీసులు వెంటనే అతడిని పోఖ్రాన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్‌కు తరలించారు. నిందితుడికి నేర ప్రవృత్తి ఉందని పోలీసులు తెలిపారు. తరచూ మహిళలను వేధించేవాడు. అతను పెళ్లి చేసుకున్నప్పటికీ అతని చర్యలతో విసిగిపోయిన అతని భార్య విడిచిపెట్టింది. భార్య వెళ్లిపోయినా నిందితుడు కళ్లు తెరుచుకోలేదు. ఇప్పుడు బహిరంగంగానే మహిళలను వేధిస్తున్నాడు. ప్రస్తుతం నిందితుడు కోలుకునే వరకు వేచి చూస్తున్నాం. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read Also:Terror Attack in Doda: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ పోస్ట్‌పై మరోసారి దాడి.. మూడు రోజుల్లో మూడోసారి..!

Read Also: