NTV Telugu Site icon

Jaipal Reddy: రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి

Jaipal Reddy

Jaipal Reddy

ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి, మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే వినోద్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో అయన పోషించిన పాత్ర గొప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పుకొచ్చారు.

నేడు దివంగత కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్ రెడ్డి 83వ జయంతి. ఈ సందర్భంగా ఆయన సమాధి వద్ద శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వినోద్ కుమార్, మందుల సామెల్ సహా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ‘జైపాల్ రెడ్డి చేవెళ్ల ప్రాంతాన్ని ఎంపీగా అనేక విధాలుగా అభివృద్ధి చేశారు. వారు చూపించిన మార్గంలో నడవడానికి మేం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు జైపాల్ రెడ్డిని మర్చిపోకుండా ఉండాలి. మా ప్రాంతంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అయన పేరు పెట్టడం సంతోషకరం’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

Also Read: KTR-ED: ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అరెస్ట్‌!

‘ప్రజా సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో జైపాల్ రెడ్డి పోషించిన పాత్ర గొప్పది. ఆయనతో 40 ఏళ్లు కలిసి పని చేశా. వివిధ ప్రజా సమస్యలు పరిష్కరానికి కృషి చేశారు. రాజకీయ, సామాజిక అభివృద్ధి కొరకు సమాజ శ్రేయస్సు, న్యాయం, ధర్మం కోసమే ఆయన పని చేశారు. తెలంగాణలో ఆయన లాంటి నాయకుడు పుట్టడం గొప్ప వరం’ అని జానారెడ్డి పేర్కొన్నారు. ‘విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు సమాజ హితం కాంక్షించిన వ్యక్తి జైపాల్ రెడ్డి. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీని సమున్నతంగా నిలిపిన వ్యక్తి. ఆయన రాబోయే తరాలకు ఆదర్శం’ అని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని చల్లార్చడానికి కేంద్రమంత్రి పదవి ఇస్తాము అన్నారు. దానిని ఆ సమయంలో ఆయన తిరస్కరించారు. ఉద్యమంలో ఆయన పాత్ర గొప్పది. ఆయన గొప్ప మేధావి. జైపాల్ రెడ్డి నాకు ఆదర్శం. ఆయన ఎప్పటికైనా నువ్వు ఎమ్మెల్యే అవుతావ్ అని ప్రోత్సహించారు’ అని ఎమ్మెల్యే మందుల సామేల్ చెప్పుకొచ్చారు.

Show comments