NTV Telugu Site icon

JD Lakshminarayana: జై భారత్ పార్టీ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలు ఇవే

Jd

Jd

ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ మేనిఫెస్టో ప్రకటించింది. కాగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల కోసం పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే కాకుండా దీనికి పీపుల్స్ మ్యానిఫెస్టోగా వీవీ లక్ష్మీనారాయణ నామకరణం చేశారు.

రైతులకు ప్రతి నెలా రూ.5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి రూ.15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్ లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న SI, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యాంశాలు..

Show comments