Site icon NTV Telugu

Car Accident: అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం.. జనం పైకి దూసుకెళ్లిన కారు..9మంది మృతి

Ahmedabad, Gujarat

Ahmedabad, Gujarat

Car Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై పెను ప్రమాదం జరిగింది. ఇక్కడ వేగంగా వచ్చిన కారు జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 నుంచి 20 మంది వరకు గాయపడ్డారు. అంతకుముందు థార్- ట్రక్కు ఢీకొన్న సంఘటనను చూసేందుకు జనం గుమిగూడారు. అంతలో ఒక్కసారిగా జాగ్వార్ కారు వచ్చి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు కూడా మృతి చెందారు. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులు బాధతో విలపిస్తూ కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also:Today Gold Price: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతోంది. వేగంగా వస్తున్న ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతులను గుర్తించి వారి బంధువులకు సమాచారం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం, సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై బుధవారం రాత్రి 1.15 గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ఎక్కువగా రద్దీగా ఉంటుంది. థార్ – ట్రక్కు ఢీకొనడాన్ని చూడటానికి ప్రజలు ఇక్కడ గుమిగూడారు, అకస్మాత్తుగా అదుపుతప్పిన కారు జనాలపైకి దూసుకొచ్చింది.

Read Also:Railways Offers : గుడ్ న్యూస్..ఆ కోచ్ లో ప్రయాణించేవారికి బంఫర్ ఆఫర్..

Exit mobile version