NTV Telugu Site icon

Jagga Reddy: నా మనసులో మాట చెప్తున్నా.. వీడియో విడుదల చేసిన జగ్గారెడ్డి

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: నా మనసులో మాట చెప్తున్నాను అని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక సూటి ప్రశ్న? అని తెలిపారు. సంగారెడ్డి ప్రజలు కూడ ఇది ఆలోచన చేయాలన్నారు. నా మనసులో మాట చెప్తున్నాను అంటూ ఈ వీడియో మీరు మంచిగా విని తర్వాత ఆలోచన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. నాగురించి హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పేది ఒక్కటే.. మీ అందరికి తెలుసన్నారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్న హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిని అన్నారు. హరీష్ రావు ఫోన్ లో అందుబాటులో ఉంటాడని అంటారని అన్నారు. మరి పేద ప్రజలకు హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏమి చేశారు ఒక్కటి చెప్పమనండి? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఎవరికైనా ఇండ్ల జాగలు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. ఒక 100 గజాలు ఎవరికైనా ఇస్తే చెప్పండి అన్నారు. పేద ప్రజలకు ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారా ..? గరీబ్ వాళ్ళకి ఏమైనా లోన్ లు ఇప్పించి సహాయం చేశారా ఉపాధి కల్పించారా..? అన్నారు. ఇప్పుడు హరీష్ రావు సంగారెడ్డి లో జగ్గారెడ్డిని ఓడగొట్టాలని చూస్తున్నాడని అన్నారు. ఎందుకంటే ఇక్కడ జగ్గారెడ్డి ని ఒడిస్తే ఆ ఫ్యామిలీ లో తన ఉనికి ఉంటుందన్నారు. లేదంటే ఆ ఫ్యామిలీ లో హరీష్ రావు ఉనికి పోతుందన్నారు. హరీష్ రావు ఉనికి కోసం సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డి కి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందా..? ప్రజలు ఆలోచన చేయాలన్నరు.

ఎవరైనా రాజకీయంగా ఇతర పార్టీ వాళ్ళు పనుల కోసం ఎక్కడికైనా అధికారుల దగ్గరికి వెళ్తే చేయొద్దని చెప్పనా? పోలీస్ లకు చెప్పి ఇబ్బంది పెట్టనా.. లేదు కదా అన్నారు. నా రాజకీయ జీవితంలో అలా ఎప్పుడు చేయలేదు కదా అన్నారు. ఈ 9 ఏళ్లు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూశారు కానీ చేసింది ఏమి లేదన్నారు. నేను 2013 లో సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే గా ఉన్నపుడు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సిద్దాపూర్, అలియాబాద్ గ్రామంలో పేద ప్రజలకి ఇండ్ల ప్లాట్ సర్టిఫికెట్ లు ఇప్పించదన్నారు. కొండాపూర్ మండలం, అలియాబాద్ గ్రామంలో ఇచ్చిన 4వేల ప్లాట్ లు, సదశివాపేట్ మండలం, సిద్దాపూర్ గ్రామంలో 5 వేల ప్లాట్ లు అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక ఆ ప్రజలకు పొజిషన్ ఇవ్వకుండా పోలీస్ లను పెట్టి వెళ్లగొట్టారు కదా? అన్నారు. పోలీస్ వాళ్ళతో కొట్టించి మరి వెళ్ళగొట్టినావని మండిపడ్డారు. నేను ఇప్పుడు చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సర్టిఫికెట్ లు ఇచ్చినవారందరికి సిఎం దగ్గర కూర్చొని కబ్జా ఇప్పిస్తా అన్నారు. ఇంకా పేద వారికి ఇండ్ల కోసం ప్లాట్ లు ఇప్పిస్తా అన్నారు. మరి ఫోన్ లో దొరికి నువ్వేం చేసినావు హరీష్ రావు.. ఇది చేసిన అని చెప్పు అన్నారు. కష్టాలో ఆపదలో ఉన్నవారికి నేను అందుబాటులో ఉంటా కదా? అన్నారు. సరే హరీష్ రావు చెప్పిండని మీరు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే లాభం ఏముందన్నారు. రేపు రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా అని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నపుడు నేను చేసిన అభివృద్ధి మీరు చూశారు కదా అన్నారు.

సంగారెడ్డి టౌన్ లో గుంతలు ఉంటే.. మీరు ఎమ్మెల్యే చేయగానే మంజీరా నీళ్లు పైకి వచ్చేలా చేసిన కదా అని తెలిపారు. సరే ఈ తొమ్మిది ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏంటి? అన్నారు. రైతు బంధు ఇస్తున్నం అంటారు ఇది నువ్వు ఇస్తా అన్నావు వాళ్ళు ఓట్లు వేసిండ్రు ఇస్తున్నావన్నారు. ఏ ప్రభుత్వం ఐన చెప్పింది ఇస్తాది కదా అన్నారు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు నన్ను గెలిపించుకుంటే ఎన్నో పనులు చేయాలనీ అనుకుంటున్నానని తెలిపారు. ఈ తొమ్మిది ఏళ్లలో కానీ పనులు అన్ని చేస్తా అన్నారు. కానీ ప్రజలరా ఆలోచన చేయండన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే గా ఉంటే అన్ని పనులు చేయిస్తే.. ఏమైనా తేడా కొడితే నేను కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏ మొఖం పెట్టుకొని అడుగుతా అన్నారు. అదే ఎమ్మెల్యే గా ఉంటే నియోజకవర్గానికి ఏం కావాలో అన్ని దగ్గరుండి చేయించగలను ఇది మీకు తెలుసన్నారు. ఎవరో చెప్పుడు మాటలు వినకండి అని సూచించారు. హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మాటలు వినే ముందు వాళ్ళు ఏం చేశారో ఆలోచన చేయండి అని తెలిపారు. తనని ఎమ్మెల్యే గా గెలియించుకోండి.. 20 నుండి 25 వేల మెజారిటీ తో గెలిపించుకోండి.. సంగారెడ్డి టౌన్ లో 40 వేల ఓట్లు ఇవ్వండి..అన్ని మండలాల్లో, సదశివాపేట్ టౌన్ లో మెజారిటీ ఇవ్వండి.. అని విజ్ఞప్తి చేశారు. ఈ నెల జరిగే 30 వ తేదీ పోలింగ్ రోజు ఈవిఏం లో 3 వ నెంబర్ చేతి గుర్తు పై ఓటు వేసి గెలిపించండి అని తెలిపారు. ఇట్లు మీ జగ్గారెడ్డి అంటూ వీడియోను ముగించారు.
IND vs AUS: సిరీస్ మ‌ధ్య‌లోనే స్వ‌దేశానికి ఆరుగురు ఆస్ట్రేలియా ప్లేయర్స్!

Show comments