Site icon NTV Telugu

Jagapathi Babu: డబ్బు ఓ అవసరం.. కానీ అదే సర్వస్వం కాదు!

Jagapathi Babu makes his Hindi debut with Pukar film

Jagapathi Babu: సీనియర్ హీరో ‘జగపతి బాబు’ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హీరోగా, విలన్ గా ఇంకా ఎన్నో ముఖ్య పాత్రలలో మెప్పించిన ఆయన ఎక్కువగా సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తులు చూశానని, అలాగే ఎన్నో లోతులు చూశానని.. మల్లి తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఇంకాపోత్జ్ తాజాగా ఆయన ఓ ప్రముఖ ప్రాడ్క్యాస్ట్ షోలో పాల్గొని అనేక జీవిత సత్యాలను మాట్లాడాడు. అందులో డబ్బులకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

8000mAh బ్యాటరీ, 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో TECNO POVA Curve 2 5G లాంచ్.. ధర ఎంతంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, అప్పుడప్పుడు జీవితం గురించి, సమాజం గురించి చెప్పే మాటలు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా డబ్బు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మనం డబ్బు వెంట పరిగెత్తడం కాదు, అది మన దగ్గరికి వచ్చేలా ఉండాలని అన్నారు. అలాగే డబ్బు అనేది కేవలం అవసరాలను తీర్చే ఒక సాధనం మాత్రమేనని.. ఒకప్పుడు స్టార్ హీరోగా ఉండి, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను చూసిన వ్యక్తి కావడంతో, డబ్బు విలువ ఆయనకు బాగా తెలుసునన్నారు.

Thailand GL Series: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ విప్లవం.. ప్రపంచ ఫ్యాన్ కల్చర్‌కు కొత్త నిర్వచనం

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు అని, దాని కోసం ప్రాణ స్నేహితులను, బంధువులను కూడా దూరం చేసుకోవడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తను వందల కోట్ల ఆస్తులను పోగొట్టుకున్నప్పటికీ, ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఆయన అన్నారు. ఆస్తుల కంటే ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా పలకరించే మనుషులు ఉండటమే నిజమైన సంపద అని తెలిపారు. డబ్బు కోసం అబద్ధాలు ఆడటం, వేషాలు వేయడం కంటే.. ఉన్నదానితో తృప్తిగా బతకడం మేలు.. అని జగపతి బాబు డబ్బు గురించి ఓ సందేశం అందించారు.

Exit mobile version