Site icon NTV Telugu

Jagapathi Babu: ‘రుద్రంగి’లో జగపతి బాబు.. లుక్ అదుర్స్

Jagapathi Babu

Jagapathi Babu

Jagapathi Babu Rudrangi: నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సీనియర్ హీరో జగపతిబాబు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం’రుద్రంగి’. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు యూనిట్.

దీనికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్శించింది. అలా ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్ ని టైటిల్ మోషన్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేయగా అందులో నటుడు జగపతి బాబుని భీకరంగా కనిపించారు. జాలి- దయ లేని ‘భీమ్ రావ్ దొర’ గా పరిచయం చేశారు.

Read Also: Bharat Jodo Yatra: 600 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న రాహుల్ జోడో యాత్ర

బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ కి ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో అదే జోష్ లో చిత్రాన్ని థియేటర్లలో అతి త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.

ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతం తో తీసుకెళుతూ “రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ” అని జగపతి బాబు డైలాగ్ తో ముగించే లోపు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుకుంటున్నాయి. కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులతో తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version