Site icon NTV Telugu

Jagapathi Babu : జపాన్ లో జగ్గూ భాయ్ క్రేజ్ మాములుగా లేదుగా..

Jagapathibabu

Jagapathibabu

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోలలో జగ్గూ భాయ్.. అలియాస్ జగపతి బాబు ఒకరు.. ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో విలన్ గా నటిస్తూ బిజీగా ఉన్నాడు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈయన ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను, సినిమాల గురించి షేర్ చేస్తారు.. తాజాగా జగ్గుభాయ్ జపాన్ వెళ్లినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఈయన బాలయ్య నటించిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్‌ వంటి హిట్ సినిమాల్లో విలన్ గా చేశాడు.. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.. హాలివుడ్ లో కూడా నటించడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ద్వారా తెలిపాడు.. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు..

ఈ క్రమంలో రీసెంట్ గా జపాన్ వెళ్లినట్లు తెలుస్తుంది.. మాములుగా తెలుగు తారలకు విదేశాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. స్టార్ హీరోలకుమాత్రమే కాదు… అదే విధంగా జగ్గూ భాయ్ కి కూడా అక్కడ జనాలు ఘన స్వాగతం పలికాడు.. జగపతిబాబుకు కూడా విదేశాల్లో ఇమేజ్ భారీగా పెరిగిపోతోంది. ఈక్రమంలో జపాన్ ఆడియన్స్ జగపతి బాబు ను చూసి సంబరపడిపోతు ఫోటోలను దిగారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్నారు..

Exit mobile version