Site icon NTV Telugu

Jagan – Bulletproof Bus: జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు..!

5jag

5jag

తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మే 13న ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు వారి క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థులు వారి నియోజకవర్గ వర్గాలలో పెద్ద ఎత్తున మీటింగ్ లు ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారాలను ముందుకు సాగిస్తున్నారు.

Also Read: Khammam Police: వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్..!

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ నుండి బుల్లెట్ ప్రూఫ్ బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రచార రథం కోసం పంజాబ్‌ లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు. ఈ బస్సులో అత్యాధునికమైన, విలాసవంతమైన సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకొక్క బుల్లెట్ ప్రూఫ్ బస్సు రూ. 13 కోట్లతో తయారు చేస్తున్నారు.

Also Read: TTD – Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. జూన్ నెల టికెట్ల విడుదల..!

వీటితోపాటు మరో 3 మినీ బస్సులను కూడా సిద్ధం చేశారు అధికారులు. వీటి ఖరీదు దాదాపు 10 కోట్ల వరకు ఉండొచ్చని అంచన. ఇందుకు సంబంధించి ఇప్పటికే విజయవాడకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సు.. మరో 3 మినీ బస్సులు వచ్చాయి. వాటిని వైసీపీ పార్టీ ప్రోగ్రాం కమిటీ ఇన్‌చార్జ్ తలశిల రఘురాం ఆర్టీసీ డిపోకు వెళ్లి వాటిని పరిశీలించారు. అయితే ఈ బస్ లు ఎన్నికల కోడ్ రావడానికి ఒక రోజు ముందు నగరానికి వచ్చింది. అంతేకాదు మరో వారం రోజుల్లో ఇంకొక బుల్లెట్ ప్రూఫ్ బస్సు నగరానికి రాబోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో కారణంగా అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version