NTV Telugu Site icon

Jacques Kallis: 48 ఏళ్ల వయసులో ఆ కొట్టుడేంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Jacques Kallis

Jacques Kallis

California Knights Batter Jacques Kallis Batting Video Goes Viral: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కల్లిస్‌.. తనలో సత్తా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌లో కల్లిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఏకంగా 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కల్లిస్‌ తన ట్రెడ్‌మార్క్‌ షాట్లతో క్రికెట్ అభిమానులను అలరించాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూఎస్‌ మాస్టర్‌ లీగ్‌ 2023లో కాలిఫోర్నియా నైట్స్‌కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం జాక్వస్‌ కల్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా టెక్సాస్‌ ఛార్జర్స్‌, కాలిఫోర్నియా నైట్స్‌ మధ్య శనివారం ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నిర్ణీత 10 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 158 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ జాక్వస్‌ కల్లిస్‌ చెలరేగిపోయాడు. మిలాంద్‌ కుమార్‌ (76 నాటాట్‌; 28 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.

Also Read: Asia Cup 2023: సంజూ శాంసన్‌కు షాక్.. తెలుగు కుర్రాడికి ఛాన్స్! ఆసియా కప్ ఆడే భారత జట్టు ఇదే

అనంతరం 159 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్‌ ఛార్జర్స్‌.. నిర్ఱీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. టెక్సాస్‌ బ్యాటర్లలో ముక్తర్‌ ఆహ్మద్‌ (33), ఉపుల్‌ తరంగా (27) టాప్ స్కోరర్లు. మొహ్మద్ హాఫిజ్ (2), బెన్ డంక్ (18) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక కాలిఫోర్నియా బౌలర్లలో నర్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. సిడిల్‌, పావెల్‌, సుయాల్‌ తలా వికెట్‌ తీశారు. అయితే జాక్వస్‌ కల్లిస్‌ బ్యాటింగ్ చూసిన ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 48 ఏళ్ల వయసులో ఆ కొట్టుడేంది సామీ అని కామెంట్స్ పెడుతున్నారు.