NTV Telugu Site icon

Jacqueline Fernandez : పేదల కోసం స్టార్ హీరోయిన్ వేసుకున్న దుస్తులు వేలం.. త్వరగా పాడేసేయండి

Jacqueline Fernandez,

Jacqueline Fernandez,

Jacqueline Fernandez : ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకోకుండా ఉండలేము. మంచి కోసం.. ఏదైనా సేవాకార్యక్రమాన్ని తలపెడితే దానిని ప్రశంసించకుండా ఉండలేం. అభివృద్ధి చెందుతున్న భార‌త‌దేశంలో ఇంకా విద్యకు నోచుకోని వారు ఎందరో ఉన్నారు. బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల కోసం ఏదైనా చేయాల‌ని ఆలోచిస్తే అది కచ్చితంగా ప్రోత్సహించదగినదే. ప‌ది మందిని ఆలోచింప‌జేసే మంచి నిర్ణయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పుడు హిందీ ప‌రిశ్రమ నుంచి స్టార్ హీరోయిన్ అయిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ అలాంటి ఒక మంచి ప‌నికి `నేను సైతం` అంటూ ముందుకు వ‌చ్చింది. సామాజిక కార్యక్రమం `బీస్ట్ ఫిలాంత్రోపీ`తో క‌లిసి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ `ఎంపవర్ గర్ల్స్ ఇన్ ఇండియా` ఇనిషియేష‌న్ కోసం ముంద‌డుగు వేశారు. అంతేకాదు ఆన్‌లైన్ లో జాక్విలిన్ ధ‌రించిన డిజైన‌ర్ దుస్తుల‌ను వేలం వేయ‌డం ద్వారా వ‌చ్చే మొత్తాన్ని బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల చ‌దువుల కోసం ఉప‌యోగించాల‌నేది వారి ప్లాన్.

Read Also:Daayra : పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సరసన కరీనా కపూర్

ఈ వేలంలో పాల్గొని భారతదేశంలోని బ‌డుగు బ‌ల‌హీన వర్గాల ఆడ‌పిల్లల విద్య, జీవితాన్ని మార్చే అవకాశాలకు నిధులు సమకూర్చడంలో సాయం చేయాల్సింది వారు కోరుతున్నారు. బీస్ట్ ఫిలాంత్రోపీ బయోలోని లింక్ ద్వారా వేలంలో పాల్గొని జాక్విలిన్ దుస్తుల‌ను ఫ్యాన్స్ సొంతం చేసుకోవ‌చ్చు. జాక్విలిన్ చేస్తున్న ప్రయత్నం బావుంది. పేద విద్యార్థినులు ఖ‌రీదైన విద్యను సొంతం చేసుకోవాలంటే క‌చ్ఛితంగా విరాళాలు అందించే దాత‌లు కావాలి. అలాంటి వారిని ప్రేరేపిస్తూ భారీ సేవా కార్యక్రమాన్ని జాక్విలిన్ ముందుకు న‌డిపించ‌డం నిజంగా ప్రశంసించదగినది. కాన్ మేన్ సుఖేష్ చంద్రశేఖర్ 200 కోట్ల మోసం కేసులో అత‌డి నుంచి బ‌హుమ‌తులు అందుకున్న వారి జాబితాలో జాక్విలిన్ పేరు వినిపించ‌డం నిజంగా ఆశ్చర్యపరిచింది. అయితే ఇలాంటి అప్రదిష్ట నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు జాక్విలిన్ వీలైన‌న్ని మంచి ప‌నులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Read Also:Flying Flea C6 Price: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ ఇదే.. సింగిల్‌ ఛార్జింగ్‌పై 150 కిమీ!