Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్.. బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకునే ఈ జంట, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచారు. తన భార్య రకుల్‌తో ఉన్న బంధం గురించి జాకీ వాడిన ఒక పదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా ‘సిట్యుయేషన్‌షిప్’ అనే పదాన్ని ఒక స్పష్టత లేని బంధం గురించి చెప్పడానికి వాడుతుంటారు. కానీ జాకీ దీనిని ఒక కొత్త కోణంలో వివరించారు.. ‘మాకు పెళ్లయింది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నట్లే ఫీలవుతాం. అంటే మా మధ్య బంధం ఎప్పుడూ కొత్తగా, బోర్ కొట్టకుండా ఉంటుంది. మేము ఒకరికొకరం ఎంతో ఎక్స్‌క్లూజివ్ (Exclusive), కానీ మా మధ్య ఉన్న స్నేహం వల్ల నేను దేని గురించైనా ఆమెతో ఓపెన్‌గా మాట్లాడగలను’ అని జాకీ చెప్పుకొచ్చారు. మనకు తెలిసి పెళ్లయిన తర్వాత చాలా జంటలు ఒక రకమైన బాధ్యతల్లో మునిగిపోయి రొమాన్స్‌ను మిస్ అవుతుంటారు. కానీ రకుల్-జాకీ మాత్రం పెళ్లికి ముందు ఉన్న ఆ ‘డేటింగ్’ వైబ్‌ను, ఆ సరదాను ఇంకా కొనసాగిస్తున్నారట. ఒకరిపై ఒకరు హక్కులు చెలాయించడం కంటే, ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టసుఖాలు పంచుకోవడమే తమ బంధానికి బలమని ఆయన వివరించారు. ప్రజంట్ జాకీ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, జాకీ భగ్నానీ తన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ముందుకు తీసుకెళ్తున్న ఈ జంట, కొత్తగా పెళ్లయిన వారికి ఒక రకమైన ‘రిలేషన్‌షిప్ గోల్స్’ ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?