NTV Telugu Site icon

Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?

Ritu

Ritu

జబర్దస్త్ ద్వారా ఫెమస్ అయిన లేడీ కమెడీయన్లలో లేడీ కమెడియన్ రీతూ చౌదరి కూడా ఒకరు.. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ను పెంచుతూ ఫోటోలకు పోజులు ఇస్తుంది.. ఈ అందాలకు యూత్ ఫిదా అవ్వడంతో ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.. సీక్రెట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుందనే వార్త షికారు చేస్తుంది..

రీతూ గతంలో ఆమె ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి రీతూ చౌదరి బాయ్ ఫ్రెండ్ అని తెలిసింది. అలాగే ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అతడు ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం జరిగింది.. ఆ వార్తలు మొన్నటివరకు వినిపించాయి.. ప్రస్తుతం సైలెంట్ అయ్యాయి..ఈ విషయం పై ఈ అమ్మడు స్పందించలేదు..

తాజాగా ఆ వ్యక్తితో ఆ అమ్మడుకు పెళ్లి అయిపోయిందని ఫొటోలు బయటకు వచ్చాయి. నిరాడంబరంగా స్నేహితుల మధ్య రీతూ చౌదరి తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఏడాది క్రితమే రీతూ చౌదరి పెళ్లి జరిగిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇకపోతే ఇటీవల రీతూ చౌదరి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి సడెన్ గా మృతి చెందారు.. తండ్రి మరణాన్ని రీతూ చౌదరి తట్టుకోలేకపోయారు. ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. అనంతరం ఒక షోలో తండ్రిని తలచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.. ఒకవైపు తండ్రి పోయి కొద్ది రోజులు కూడా అవ్వకుండానే యాంకర్ విష్ణు ప్రియతో కలిసి థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు..

Show comments