జబర్దస్త్ వర్ష పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒక జబర్దస్త్ మాత్రమే కాదు బుల్లితెరపై కనిపిస్తున్న పలు షో లలో కనిపిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల్లో అవకాశాలు వస్తున్న కూడా అందాల డోస్ పెంచుతు వస్తుంది.. తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో స్కిన్ ఫిట్ లుక్ లో ఉన్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..
ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్లో సూపర్ హాట్ ఫోజులతో కాకరేపింది. వర్ష ఫోటోలు వైరల్ అవుతున్నాయి.గతంతో పోల్చుకుంటే వర్ష ఫేమ్ బాగా పెరిగింది. అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు.. బుల్లితెరపై హాట్ బ్యూటీగా తన హవాను కొనసాగిస్తుంది..
మొదట ఈ అమ్మడు సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. ఇక ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.. ఫ్యూచర్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది..