జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి యూత్ బాగా తెలుసు.. కుర్రాళ్లకు హీటేక్కించేలా కిర్రాక్ పోజులతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో మైండ్ బ్లాక్ చేసింది.. పూలల్లో ఒకపువ్వులా కలిసి పోయి ఫోటోలకు పోజులు ఇచ్చింది..వర్ష లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ అమ్మడు బాగా పాపులారిటిని సంపాదించుకుంది..
అటు లేడీ కమెడియన్ గా ఇటు సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా వెలుగొందుతోంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోల్లో వర్ష సందడి చేస్తున్నారు.. బుల్లితెరపై రానిస్తున్న నటులలో ఒకరు ఫెమస్ అయ్యింది.. వర్ష సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించారు. అయితే అక్కడ వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ఆమెను జబర్దస్త్ ఓవర్ నైట్ స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆమె అందం,కామెడీ తో అతి తక్కువ కాలంలోనే కమెడియన్ గా బాగా ఫెమస్ అయ్యింది..
కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. దాంతో మోస్ట్ వాంటెడ్ ఆన్ స్క్రీన్ కపుల్ మారిపోయారు..వీరి లవ్ ట్రాక్ అప్పుడప్పుడూ శృతి మించుతోంది. వర్ష మెడలో ఇమ్మానియేల్ తాళి కట్టడం సంచలనంగా మారింది. ఆ మధ్య ఇమ్మానియేల్ జబర్దస్త్ షో వేదికపై వర్షను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వర్షను నగల దుకాణానికి తీసుకెళ్లి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చాడు.. దాంతో నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా అనే సందేహాలు జనాల్లో మొదలైయ్యాయి… ఇమ్మానియేల్ నాకు దొరికిన అదృష్టమన్న వర్ష అతన్ని వదిలేది లేదంటుంది. ఇమ్మానియేల్ ఏమో అలాంటిదేమీ లేదు. షూటింగ్ అయ్యాక నా దారి నాది ఆమె దారి ఆమెది అంటారు.. చూద్దాం చివరికి ఏం చెప్తారో.. ప్రస్తుతం వీరిద్దరూ షోలతో బిజీగా ఉన్నారు..