NTV Telugu Site icon

Madhyapradesh : ముందు గుడికి దండంపెట్టాడు.. తర్వాత బాంబులు వేశాడు

New Project (9)

New Project (9)

Madhyapradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యువకుడు తనకు గుండా మామూలు ఇవ్వలేదని ఓ ఇంటిపై బాంబులు వేశాడు. తొలుత గుడి వద్దకు చేరుకున్న యువకుడు దండం పెట్టుకుని ఆ తర్వాత తనకు డబ్బులు ఇవ్వని వారి ఇంటి పై బాంబులు విసిరాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జబల్‌పూర్ జిల్లాలో జరిగింది. ఓ దుండగుడు ముందుగా ఆలయంలో పూజలు చేసి ఆపై ఒకదాని తర్వాత ఒకటి రెండు బాంబులు విసిరి రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. జబల్‌పూర్‌లోని ఘమాపూర్ ప్రాంతంలో బాంబు పేలుడు ఘటనతో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం ప్రకారం.. స్థానికంగా ఉండే ఆనంద్ అనే నేరస్థుడు గూండా ట్యాక్స్ కట్టలేదన్న కారణంతో ఓ ఇంట్లో మొదట బాంబు విసిరి, ఆపై కాల్పులు జరిపి భయాందోళన వాతావరణం సృష్టించాడు.

Read Also:India-Canada: సిక్కు వేర్పాటువాదులకు భారత రాయబారి వార్నింగ్

Read Also:Kesineni Swetha: జగనన్న ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు..

ఏరియా క్రిమినల్ ఆనంద్ ఠాకూర్ బాంబులు విసిరి కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఘమాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారత్ సేవక్ సమాజ్ స్కూల్ సమీపంలో నివేదించబడింది. మాన్‌సింగ్ ఠాకూర్ ఇంటిపై ఆనంద్ బాంబులు పేల్చి కాల్పులు జరిపిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. సీసీటీవీ ద్వారా ఆనంద్ ఠాకూర్ అనే నేరస్థుడిని పోలీసులు గుర్తించారు. వీడియోలో, బాంబు దాడి తర్వాత నిందితుడు ఆనంద్ ఠాకూర్ కూడా కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. పోలీసులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చిరు దుకాణాదారులను వేధిస్తున్నట్లు నిందితులపై పలు ఆరోపణలు ఉన్నాయి.