NTV Telugu Site icon

ITR Filing Date: శుభవార్త.. గడువు ముగిసినా ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు

Income Tax

Income Tax

ITR Filing Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిటర్న్ చేసేందుకు ఈ సారి ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు. జూలై 31 వరకు ప్రజలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయాలను వెల్లడించాలి. ఈసారి జూలై 31 వరకు 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. చాలా మంది వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను గడువు తేదీ 31 జూలై 2023 నాటికి కూడా ఫైల్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ప్రజలకు ఓ శుభవార్త వ‌చ్చింది.

ఆదాయపు పన్ను రిటర్న్
మీరు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులైతే.. గడువు తేదీలోగా రిటర్న్‌ను ఫైల్ చేయలేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 31 డిసెంబర్ 2023 వరకు పన్ను చెల్లించే అవకాశం ఉంది. దీన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం అంటారు. ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లను 31 జూలై తర్వాత కానీ డిసెంబర్ 31లోపు ఎప్పుడైనా ఫైల్ చేయవచ్చు. అయితే దీని కోసం ప్రజలు ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also:Game Changer : సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’..

లేట్ ఫీజు ఎంత?
ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌కు పెనాల్టీ అనేది మీ సంపాదన ఆధారంగా ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఆలస్య రుసుముగా రూ. 5000 చెల్లించి పన్నును దాఖలు చేయవచ్చు. మరోవైపు రూ.5 లక్షల లోపు జీతం ఉన్నవారు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

చివరి తేదీ
ఫైనాన్స్ యాక్ట్ 2021లోని సవరణ ప్రకారం.. 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరం నుండి పన్ను చెల్లింపుదారులు సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్‌మెంట్ పూర్తయ్యే ముందు.. ఏది ముందుగా అయితే ఆలస్యమైన రిటర్నులను సమర్పించవచ్చు. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను అధికారి స్వయంగా అసెస్‌మెంట్‌ను పూర్తి చేయకపోతే ఆలస్యమైన రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023.

ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల కలిగే మరో ప్రతికూలత ఏమిటంటే, గడువు తేదీకి ముందు ITR దాఖలు చేసినప్పుడు, పన్ను చెల్లింపుదారులు ఏప్రిల్ 1 నుండి రీఫండ్ తేదీ వరకు వాపసు మొత్తంపై నెలకు 0.5% చొప్పున వడ్డీని పొందుతారు. అయితే, ఆలస్యమైన రిటర్న్‌ల విషయంలో, ఈ వడ్డీ ITR ఫైల్ చేసిన తేదీ నుండి రీఫండ్ తేదీ వరకు లెక్కించబడుతుంది.

Read Also:Health Tips :కాఫీలో వీటిని కలిపి తాగితే నెల రోజుల్లో నాజుగ్గా మారిపోతారు..