ఇటలీలో ఖైదీల కోసం మొట్టమొదటి సెక్స్ రూమ్ శుక్రవారం ప్రారంభమైంది. ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో సెక్స్ రూమ్స్ ను ఏర్పాటు చేస్తు్న్నారు. సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని జైలులోని ఓ ఖైదీ తన మహిళా భాగస్వామిని ప్రైవేట్ గా కలిసేందుకు అనుమతించారు. కొంతమంది ఖైదీలకు ప్రైవేట్ కలయికల కోసం రాజ్యాంగ కోర్టు తీర్పు తర్వాత ఖైదీలకు ప్రైవేట్ సందర్శనలు జరిగాయి. ఇది ఖైదీలు బయటి నుంచి వచ్చే భాగస్వాములతో “సన్నిహిత సమావేశాలు” కలిగి ఉండే హక్కును గుర్తించింది. “అంతా సజావుగా జరిగినందుకు మేము సంతోషంగా ఉన్నాము, కానీ ఇందులో పాల్గొన్న వ్యక్తులను రక్షించడానికి గోప్యతను పాటించడం అవసరం” అని ఉంబ్రియా ఖైదీల హక్కుల అంబుడ్స్‌మన్ గియుసెప్పే కాఫోరియో ANSA వార్తా సంస్థకు తెలిపారు.
Also Read:Jyothula Nehru: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ఉచితంగా బియ్యం ఇమ్మని ఎవరు అడిగారు..?
జనవరి 2024లో వెలువరించిన తీర్పులో, ఖైదీలకు జీవిత భాగస్వాములు లేదా ప్రియురాళ్లతో ప్రైవేట్ సమావేశాలు చేసుకునే హక్కు ఉండాలని, జైలు గార్డులు ఎవరూ వారికి అంతరాయం కలిగించొద్దని కోర్టు పేర్కొంది. యూరోపియన్ దేశాలలో చాలా వరకు వివాహేతర కలయికలు ఇప్పటికే అనుమతించబడ్డాయని తీర్పు పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, ఇతర దేశాలు ఉన్నాయి. సన్నిహిత సమావేశాలకు అనుమతి పొందిన ఖైదీలకు రెండు గంటల వరకు మంచం, టాయిలెట్ ఉన్న గదికి ప్రవేశం ఉండాలని పేర్కొంటూ న్యాయ మంత్రిత్వ శాఖ గత వారం మార్గదర్శకాలను జారీ చేసింది. గది తలుపు అన్‌లాక్ చేసి ఉండాలని, జైలు గార్డులు జోక్యం కూడా ఉండదని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
