Site icon NTV Telugu

Fashion designer: ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి కన్నుమూత

Dis

Dis

ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ రాబర్టో కావల్లి (83) కన్నుమూశారు. ఇంట్లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1940, నవంబర్ 15న ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జన్మించారు. ఏప్రిల్ 12, 2024న ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచారు. రాబర్టో.. విలాసవంతమైన దుస్తులు డిజైన్ చేస్తుంటారు. విద్యార్థి దశ నుంచే ఫ్యాషన్‌పై మక్కువ ఉంది. 1970లో తోలుపై ప్రింటింగ్ ప్రక్రియను రూపొందించారు. జంతు-ముద్రణ డిజైన్లకు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఇక దుస్తులపై హిందూ దేవతల చిత్రాలను రూపొందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కవల్లి క్షమాపణ చెప్పారు.

 

ఇక 1964లో సిల్వానెల్లా జియానోనిని కవల్లి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అనంతరం 1974లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 1980లో మాజీ మిస్ ఆస్ట్రియా.. 1977లో మిస్ యూనివర్స్ పోటీలో మొదటి రన్నరప్ అయిన ఎవా డ్యూరింగర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 2010లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం స్వీడిష్ మోడల్ సాండ్రా నిల్సన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒకరు పుట్టారు. ఇలా మొత్తం కవల్లికి ఆరుగురు సంతానం. కవల్లి మృతికి పలువురు సంతాపం తెలిపారు. కావల్లి అంత్యక్రియలు సోమవారం ఫ్లోరెన్స్‌లో నిర్వహించనున్నట్లు ఇటలీ మీడియా వెల్లడించింది.

 

 

ఇది కూడా చదవండి: TTD For Ayodhya: ఇవాళ అయోధ్యకు టీటీడీ కమిటీ..

Exit mobile version