Site icon NTV Telugu

IT Raids : హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఐటీ సోదాలు

It Raids

It Raids

హైదరబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో వంశీరాం బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది, డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. వంశీరాం బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు దాడులు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో సీబీఐ, ఈడీ అధికారుల దాడులు కలకలం సృష్టించగా.. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.

Also Read : CBI No Reply To MLC Kavitha: ఈ రోజు కుదరదన్న కవిత.. సీబీఐపై నిర్ణయంపై సస్పెన్స్‌..!

కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… 1996 లో వంశీరాం బిల్డర్స్ ను స్థాపించారు. రెండు రాష్ట్రాల్లో 80 పైగా ప్రాజెక్టులు చేసింది ఈ సంస్థ.. అందులో.. లగ్జరీ విల్లాలు, కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయి. భార్య జ్యోతి, శైలజా రెడ్డి డైరెక్టర్లు ఆస్తులపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు తిరుపతిలో సైతం వంశీరాం ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రైమ్ ఏరియాలో భూమి కొనుగోలు, ప్రాజెక్ట్ చేపట్టారు సుబ్బారెడ్డి. దీంతో.. పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలపై ఊటీ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version