NTV Telugu Site icon

IT Notices : కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు

Komuravelli Mallikarjuna Swamy Temple

Komuravelli Mallikarjuna Swamy Temple

IT Notices : భక్తుల కొంగు బంగారం అయిన దేవుడికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు తప్పలేదు. పన్ను కట్టి తీరాల్సిందే అంటూ అధికారులు నోటీసులు పంపించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ రోజు ఉదయమే కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ చేశారు ఐటీ అధికారులు. 11 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ.. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Read Also:YV Subba Reddy: పవన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్‌.. తప్పుచేసిన వ్యక్తిని ఎలా సపోర్ట్ చేస్తారు..!

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసిన 12A రిజిస్ట్రేషన్ చేయించలేదు కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. 1995 నుంచి ఇప్పటివరకు ఐటీ రిటర్న్ లు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 1995 నుంచి ఐటీ రిటర్న్ లు, ఆడిట్ వివరాలు సమర్పించాలని ఐటీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను శాఖ దేవుడి గుడి కూడా నోటీసులు జారీ చేయడంతో విషయం తెలిసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

Read Also:Mouni Roy: వైట్ కలర్ శారీ అందాలతో అలరిస్తున్న మౌని రాయ్..

Show comments