పొంగులేటి కమ్యూనిస్టు ల మీద బురద చల్లడం సరికాదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులగా మేము ఎప్పుడు మారలేదు.. పొంగులేటి ఎన్ని పార్టీలు మారారు.. డబ్బులతో వ్యవస్థను అవినీతి మయం చేస్తారా అని కూనంనేని అన్నారు. మమ్ములను గెలుకవద్దు.. మీరు సమాజానికి చిడ పురుగులుగా తయారు అయ్యారు అని కూనంనేని సాంబశివరావు అన్నారు. రూపాయ ఖర్చు పెట్టకుండా ఎన్నికల రంగంలోకి రండి పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు.
Also Read : Covid-19: దేశంలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..?
మీకు దమ్ముంటే రూపాయి ఖర్చు లేకుండా గెలవలన్న, గెలిపించాలన్నా , ఓడించలన్న కమ్యూనిస్టుల పాత్ర ముఖ్యం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. నాన్ ట్రైబ్స్ కూడా పట్టాలు ఇవ్వలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నినాదం వేరు ప్రజల సమస్యలపై పోరాటం వేరు.. ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తామని కూనంనేని అన్నాడు. లెఫ్ట్ పార్టీలు సీఎంకు జాయింట్ గా లేఖ రాస్తామని సాంబశివరావు వెల్లడించారు.
Also Read : Tragedy : ఏడునెలల గర్భిణి అయిన భార్య మృతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న జవాన్
ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 14న భద్రచలం నియోజకవర్గంలోని చర్ల మండలం నుంచి చేపట్టిన ప్రజా పోరు యాత్ర గురవారం కొత్తగూడెంలో ముగిసింది. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.