Site icon NTV Telugu

Israel: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఈ ముస్లిం దేశమేనా?..

Israel Turkey Conflict

Israel Turkey Conflict

Israel: ఖతార్‌లో హమాస్ నాయకత్వం సమావేశం అయిన భవనంపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్‌ మరో ముస్లిం దేశం అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటి, ఎందుకు దానిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంది, అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Telangana : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ గ్యాంగ్స్‌పై పోలీసుల దాడులు ఈగల్‌, GRP & RPF సంయుక్త ఆపరేషన్

నెక్ట్స్ టార్గెట్ తుర్కియో..
ఇజ్రాయెల్, టర్కీ ఒకప్పుడు బలమైన ప్రాంతీయ భాగస్వాములు. కానీ 2000ల చివరి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో ప్రారంభమైన గాజా యుద్ధం కారణంగా ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గత ఏడాది సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ ప్రభావం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతుండటంతో వాటి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తుర్కియో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చాలా కాలంగా పాలస్తీనా ఉద్యమానికి, హమాస్‌కు మద్దతుదారుగా ఉన్నారు.

దీంతో తుర్కియో ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ అని విశ్వసనీయ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. ఈ వార్త తుర్కియో నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. ఖతార్‌పై చేసినట్లుగానే ఇజ్రాయెల్ తమ దేశంపై కూడా దాడులు చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులు దేశంతో సహా మొత్తం తమ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెడుతుందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రియర్ అడ్మిరల్ జెకి అక్తుర్క్ ఇటీవల అంకారాలో తెలిపారు. ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తారాస్థాయికి తీసుకువచ్చారని విమర్శింది. తాజాగా తుర్కియో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హిట్లర్తో పోల్చింది.

ఎర్డోగన్‌ను ఖతార్ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తుర్కియో, ఎమిరేట్‌తో బలమైన సైనిక, వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఈ వారాంతంలో ఖతార్‌లో జరగనున్న అరబ్, ముస్లిం నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఎర్డోగన్ వెళ్లనున్నారు. అక్కడ ఇజ్రాయెల్ అంశంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ట్రెండ్స్ రీసెర్చ్ & అడ్వైజరీలో టర్కీ ప్రోగ్రామ్ డైరెక్టర్ సెర్హత్ సుహా క్యూబుక్కువోగ్లు మాట్లాడుతూ.. ప్రాంతీయ వైమానిక రక్షణ, అంతర్జాతీయ నిబంధనలను దాటవేస్తూ, శిక్షార్హత లేకుండా దాడి చేయగల ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఆందోళన కలిగించే విషయంగా ప్రపంచ దేశాలు గుర్తించాలని అన్నారు. బలహీనమైన, శాంతియుత దేశాల విచ్చిన్న బఫర్ జోన్‌ను స్థాపించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందని, ఈ దాడులను తుర్కియో ఎప్పటికప్పుడు గమనిస్తుందని చెప్పారు.

గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తుర్కియో అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ను, ముఖ్యంగా ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన నెతన్యాహును అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. హమాస్ అధికారులు క్రమం తప్పకుండా టర్కీని సందర్శిస్తుండటంతో పాటు, కొందరు ఆ దేశంలో స్థిరపడ్డారు. హమాస్ తన భూభాగం నుంచి దాడులను ప్లాన్ చేయడానికి, సైన్యాన్ని నియమించడానికి, నిధులు సమకూర్చడానికి తుర్కియో అనుమతిస్తోందని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది.

READ ALSO: Raipur Nude Party: న్యూడ్ పార్టీ.. వైరల్‌గా మారిన పోస్టర్లు..

Exit mobile version