NTV Telugu Site icon

Gaza Ceasefire: గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానం.. తిరస్కరించిన అమెరికా

Uno

Uno

Israel Palestine Conflict: ఇజ్రాయెల్- గాజా యుద్ధం గత రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో గాజాలో 300 మంది మరణించారు. ఇంతలో గాజాలో కాల్పుల విరమణ కోసం నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి చేసిన ప్రయత్నాన్ని అమెరికా నిన్న (శుక్రవారం) నిలిపివేసింది. అమెరికా కారణంగా ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఆమోదించలేకపోయింది.

Read Also: TSRTC Free Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఇక, ఐక్యరాజ్యసమితి సమర్పించిన తీర్మానంలో గాజాలో వెంటనే కాల్పుల విరమణతో పాటు బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలనే డిమాండ్ ఉంది. 13 సభ్య దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసాయి.. కానీ, అమెరికా దానిని వీటో అధికారం ఉపయోగించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీన దాడుల చేసిన తర్వాత.. గాజాలో తన దాడులను కొనసాగించింది. హమాస్‌ను నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిగా మద్దతిస్తోంది. యూఎన్ సెక్రటరీ- జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తక్షణ కాల్పుల విరమణ కోసం అత్యవసర భద్రతా మండలి సమావేశాన్ని పిలవడానికి UN చార్టర్‌లోని ఆర్టికల్ 99ని ఉపయోగించారు. ఆర్టికల్ 99 చాలా అరుదుగా ఉపయోగించబడుతుందని అని ఆయన తెలిపారు.

Read Also: Anurag Thakur : కాంగ్రెస్ ఉన్నచోటే ఎంపీ.. ఇంట్లో దొరికిన నోట్ల కుప్పపై అనురాగ్ ఠాకూర్

అయితే, హమాస్ ఆధ్వర్యంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు పాలస్తీనా భూభాగాల్లో 17,487 మంది మరణించారు. హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపింది. అయితే 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు. జనాభాలో దాదాపు 80 శాతం మంది నిరాశ్రయులయ్యారు.. ఆహారం, నీరు, మందులు, ఇంధనం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.