Site icon NTV Telugu

Qatar Bombing: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నాయకత్వం లక్ష్యంగా పేలుళ్లు

Israel Airstrike Qatar

Israel Airstrike Qatar

Qatar Bombing: ఇజ్రాయెల్ హమాస్ నాయకత్వాన్ని వెంటాడింది. దాని వేటకు దేశంతో సంబంధం లేదు. కచ్చితమైన సమాచారం, కరెక్ట్ టార్గెట్ ఉంటే పని పూర్తి చేయడమే తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒకటి అని పేరు. తాజా ఖతార్ రాజధాని దోహాలో ఒక్కసారి పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దళాలు ఏ ప్రదేశంలో దాడులు చేశాయో వివరాలు పేర్కొలేదు. హమాస్ ఉగ్రవాద సంస్థ సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ మిలిటరీ), ఐఎస్ఎ (భద్రతా సంస్థ) కచ్చితమైన దాడిని నిర్వహించాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

READ ALSO: Vice Presidential Election: ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ.. 20 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్..!

‘హమాస్ నాయకత్వంలోని ఈ సభ్యులు సంవత్సరాలుగా ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 7 (2023) నాటి క్రూరమైన మారణహోమానికి ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని నిర్వహిస్తున్నారు’ అని ఇజ్రాయెల్ సైన్యం తన పోస్ట్‌లో పేర్కొంది. ఖతార్ రాజధాని దోహాలో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్ అధికారి ఒకరు మీడియాతో అన్నారు. విదేశాల్లో ఉన్న హమాస్ నాయకులను టార్గెట్ చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇది జరగడం విశేషం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ “హమాస్ నాయకత్వంలో ఎక్కువ మంది విదేశాల్లో ఉన్నారు. మేము వారిని కూడా చేరుకుంటాము” అని ఆగస్టు 31న అన్నారు.

ఖతార్ హమాస్ బహిష్కరించిన నాయకులకు నిలయంగా ఉంది. గాజాపై తాజా దాడి జరగడానికి చాలా కాలం ముందు, పాలస్తీనా సమూహం, ఇజ్రాయెల్ మధ్య చర్చలలో సంవత్సరాల తరబడి ఖతార్ మధ్యవర్తిగా కూడా పనిచేసింది. ఈ దాడి వలన గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి కొనసాగుతున్న చర్చలు, 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత బందీలుగా ఉన్న వారి విడుదల సంక్లిష్టం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హమాస్ రాజకీయ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిని ఖతార్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజీద్ అల్-అన్సారీ స్పందిస్తూ దీనిని “అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల ఉల్లంఘన” అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ సైన్యం చేసిన దాడిని ప్రశంసించారు. “ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ చేయి నుంచి ప్రపంచంలో ఎక్కడా రక్షణ ఉండదని పేర్కొన్నారు.

READ ALSO: Monarchy Countries 2025: 21వ శతాబ్దంలోనూ రాచరికం.. రికార్డ్ సృష్టించిన 5 దేశాలు

Exit mobile version