Site icon NTV Telugu

Trump: శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ఇజ్రాయెల్‌, హమాస్‌.. ట్రంప్ కీలక ప్రకటన..

Trump

Trump

Trump: గాజాలో రెండు సంవత్సరాలు కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రక, అపూర్వమైన అడుగుగా అభివర్ణించారు. ఈజిప్టులో జరిగిన చర్చల అనంతరం.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ బందీలను విడుదల చేస్తుందని, ఇజ్రాయెల్ తన దళాలను అంగీకరించిన లైన్‌కు తిరిగి తీసుకువస్తుందని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు 20 పాయింట్ల శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్లు స్పష్టం చేశారు.

READ MORE: Astrology: అక్టోబర్‌ 09, గురువారం దినఫలాలు.. ఏ రాశి వారు గుడ్‌న్యూస్ వింటారంటే..?

ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో ఓ పోస్ట్ పంచుకున్నారు. శాంతి ప్రణాళిక మొదటి దశలో ఇజ్రాయెల్, హమాస్ రెండూ సంతకం చేశాయని ప్రకటించడానికి నేను చాలా గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని.. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు. అన్ని పార్టీలను సమానంగా చూస్తాం.. అరబ్‌, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్‌, ఇతర చుట్టు పక్కల దేశాలకు, అమెరికాకు ఇది ఎంతో గొప్ప రోజన్నారు. మధ్యవర్తులైన ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. “శాంతి స్థాపకులు ధన్యులు!” అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

READ MORE: PAK vs AUS: 28 సంవత్సరాలుగా పోరాటం.. పాకిస్థాన్‌ మహిళలతో కావట్లేదమ్మా! ఇక ఇంటికే

Exit mobile version