Site icon NTV Telugu

Israel Attack Pakistan: ఇజ్రాయెల్ దాడితో గజగజలాడిన పాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Israel Attack Pakistan Tank

Israel Attack Pakistan Tank

Israel Attack Pakistan: పాకిస్థాన్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో దాయదీ గజగజలాడింది. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. పాకిస్థాన్ – సౌదీ అరేబియా ఇటీవల ఒక రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయనే విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాలలో దేనిపై దాడి జరిగిన దానిని మరొక దేశంపై కూడా దాడిగా పరిగణించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్‌కు ఊహించని దెబ్బ ఇజ్రాయెల్ రూపంలో తగిలింది. ఇంతకీ ఇజ్రాయెల్ ఎందుకు పాక్‌పై దాడి చేసింది, ఇప్పుడు సౌదీ ఏవిధంగా స్పందిస్తుంది. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: DVV Entertainment: ట్విట్టర్లో కౌంటర్.. డీవీవీ నిర్మాణ సంస్థపై కేసు

ఇటీవల పాకిస్థాన్ సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను సరఫరా చేయడం గురించి మాట్లాడింది. ఈ ప్రకటనలతో పాకిస్థాన్ అనవసరంగా ఇజ్రాయెల్‌తో తన శత్రుత్వాన్ని పెంచుకుందని నిపుణులు పేర్కొన్నారు. తాజాగా ఇజ్రాయెల్ ఒక పాకిస్థాన్ ఓడపై దాడి చేసిందని వార్తలు వెలువడ్డాయి. దాడి జరిగిన సమయంలో పాకిస్థాన్ సిబ్బందితో కూడిన LPG ట్యాంకర్ ఎర్ర సముద్రంలో ఉందని, దీనిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ధృవీకరించారు. దాడి బారి నుంచి ఓడ సురక్షితంగా తప్పించుకుందని ఆయన తెలిపారు. ఆ నౌకలో 27 మంది సిబ్బంది ఉండగా, వారిలో 24 మంది పాకిస్థానీలు, ఇద్దరు శ్రీలంక పౌరులు, ఒక నేపాలీ వ్యక్తి ఉన్నారని పాక్ అధికారులు పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 17, 2025న ఓడను ప్రస్తుతం హౌతీ నియంత్రణలో ఉన్న రాస్ అల్-ఇసా ఓడరేవులో నిలిపివేశారు. ఈ సమయంలో ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా ఓడలోని LPG ట్యాంకుల్లో ఒకదానిలో భారీ పేలుడు సంభవించింది. అయితే వెంటనే సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేయడంతో అందరూ ప్రాణాలు దక్కించుకోగలిగారు.

సిబ్బందిని బందీలుగా పట్టుకున్న హౌతీలు..
పాక్ వార్తా సంస్థ ట్రిబ్యూన్ నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడి జరిగిన వెంటనే హౌతీ తిరుగుబాటుదారుల పడవలు సంఘటనా స్థలానికి చేరుకుని పాక్ ఓడను వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. వారు ఓడ సిబ్బందిని చాలా రోజుల వరకు నౌకలోనే బందీలుగా ఉంచారు. ఓడలోని సిబ్బందిపై ఆశ నెమ్మదిగా సన్నగిల్లుతున్న సమయంలో పాక్ హోం మంత్రి మోహ్సిన్ నఖ్వీ X లో ఒక పోస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తన పౌరులు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసేందుకు రాత్రింబవళ్లు పనిచేసిందని పేర్కొన్నారు. “ఇప్పుడు ట్యాంకర్, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు, పాక్ ఓడ యెమెన్ జలాలను దాటింది”. ఒమన్‌లోని పాకిస్థాన్ రాయబారి నవీద్ బుఖారీ, సౌదీ అరేబియా భద్రతా సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు హౌతీల మధ్య పాక్ పౌరులు చిక్కుకుపోయారు. దీని కారణంగా రెస్క్యూ మిషన్‌ను క్లిష్టతరం అయ్యిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతకు ఉన్న తీవ్రమైన ముప్పును మరోసారి హైలైట్ చేసింది.

READ ALSO: UPSC ESE 2026: ఇంజనీరింగ్ పూర్తయ్యిందా?.. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి..

Exit mobile version