NTV Telugu Site icon

Israel-Iran War: అమెరికా తాజా రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..!

America

America

పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగానే.. తాజాగా ఇరాన్ చేరింది. ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ ఆఫీసర్లు చనిపోయిరు. ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ భావించింది. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అన్నట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్ చేసింది. కానీ ఇజ్రాయెల్‌కు ఏం కాలేదు. ఇక ఇజ్రాయెల్‌ కూడా గత శుక్రవారం ఇరాన్‌పై ప్రతీకార దాడి చేసింది. అణు కేంద్రం లక్ష్యంగా ఎటాక్ చేసింది. కానీ ఇరాన్‌కు ఏం కాలేదు. అయితే ఈ దాడిపై మాత్రం ఇజ్రాయెల్ నోరు విప్పలేదు. ఏ అధికారి స్పందించలేదు. కానీ అమెరికా తాజా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

ఇది కూడా చదవండి: Botsa Jhansi Lakshmi: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది నిజమేనని అమెరికా అధికారులు తేల్చిచెప్పారు. దాడి జరిగిన ప్రాంతంలో శాటిలైట్ ఇమేజ్‌లని పరిశీలించగా.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ అణు, సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇస్ఫహాన్‌పై డ్రోన్లు, క్వాడ్‌ కాప్టర్లు, క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించినట్లుగా గుర్తించింది. శాటిలైట్ ఫొటోలు.. ఇస్ఫహాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈశాన్యంగా ‘S-300 సర్ఫేస్-ఎయిర్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ’కు చెందిన బ్యాటరీ ఉన్నట్టుగా చూపించాయి. అలాగే.. ఏప్రిల్ 15వ తేదీన ఓ రహస్య ప్రాంతంలో ఉంచిన S-300 రక్షణ వ్యవస్థను (S-300 Defence System) సైతం ఆ ఫోటోలు చూపాయి. కానీ.. తాజా ‘గూగుల్ ఎర్త్ ఫొటో’ మాత్రం ఏప్రిల్ 19వ తేదీ నుంచి S-300 క్షిపణి రక్షణ వ్యవస్థ జాడ లేని ఖాళీ స్థలాన్ని చూపించింది.

ఇది కూడా చదవండి: Aa Okkati Adakku :‘పెళ్లి ఎప్పుడు?’, అని అడిగే వాళ్ళని కొత్త చట్టం పెట్టి లోపలేయించండి!

అయితే.. ఇరాన్‌కు చెందిన ఇద్దరు అధికారులు మాత్రం ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. డ్రోన్లు, క్షిపణులు, విమానాలు.. ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించినట్టు ఇరాన్ సైన్యం గుర్తించలేదని పేర్కొన్నారు. అంతేకాదు.. వారి వాదనలకు ఇరాన్ రాష్ట్ర మీడియా ఏజెన్సీ IRNA కూడా మద్దతు ఇచ్చింది. ఎటువంటి దాడులు జరగలేదని, ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయబడలేదని పేర్కొంది. కానీ.. బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ విశ్లేశించిన శాటిలైట్ చిత్రాల్లో మాత్రం ఇరాన్ రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్టు చూపుతున్నాయి. రక్షణ వ్యవస్థలు గుర్తించకుండా తాము దాడి చేయగలమని ఇరాన్‌కి సందేశం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ ఈ దాడి జరిపినట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Election Commission: 8 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశాలు.. ఏ రాష్ట్రంలో అంటే..!