Site icon NTV Telugu

ISIS Uranium Plan: 1,000 టన్నుల యురేనియం కోసం ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్!

Isis Uranium Plan

Isis Uranium Plan

ISIS Uranium Plan: ప్రపంచానికి పెను ముప్పుగా పరిగణించే వారిలో ముందు వరుసలో ఉండేది ఉగ్రవాదులు. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌(ఐసిస్). దీనిని 2013లో స్థాపించారు. తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 1,000 టన్నుల యురేనియంను సాధించడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ యురేనియం వారి చేతికి అందితే, ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడవచ్చని రక్షణ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా 10,000 టన్నుల యురేనియం ఉందని అంచనా, ఇందులో 1000 టన్నులు అంటే 10 శాతం. ఈ 10 శాతం యురేనియంను ఐసిస్ ఉగ్రవాదులు హస్తగతం చేసుకుంటే, వాళ్లు దీంతో అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను సృష్టించవచ్చు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తంలో ప్రమాదంలో పడాల్సి వస్తుందని రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

READ ALSO: Ambati Rambabu Case: అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. ఆసక్తికర వాదనలు..

ఐక్యరాజ్యసమితి భద్రతా సంస్థ నివేదికల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, ఆఫ్రికన్ దేశాలలో చురుకుగా ఉంది. ప్రపంచానికి ఇస్లామిక్ ఛాందసవాదాన్ని తిరిగి తీసుకురావడమే ఈ ఉగ్ర సంస్థ ప్రధాన లక్ష్యం. పలు నివేదికల ప్రకారం.. నైజర్ వద్ద 1,000 టన్నుల యురేనియం ఉంది. దీనిని ప్రభుత్వం నియామీ చుట్టూ భద్రతా ప్రయోజనాల కోసం నిల్వ చేసింది. గతంలో, ఈ యురేనియంకు ఒక ఫ్రెంచ్ కంపెనీ కాపలాగా ఉంచింది. కానీ ఇప్పుడు, ఆ కంపెనీతో ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో, నైజీరియన్ సైన్యం దీనిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం నైజర్ అంతర్గత సంఘర్షణను ఎదుర్కొంటోంది. దీంతో ఈ 1,000 టన్నుల యురేనియంను సాధించడమే టార్గెట్‌గా ఇస్లామిక్ స్టేట్ పావులు కదుపుతుంది. .

ఇదే సమయంలో ఈ యురేనియంను విక్రయించడానికి నైజర్ చైనా, రష్యా వంటి దేశాలతో చర్చలు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు ఈ ప్రతిపాదనలలో ఎలాంటి ముందు అడగు పడలేదు. పలు నివేదికల ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు గతంలో ఒకసారి ఈ యురేనియం ఉన్న ప్రదేశంపై నియంత్రణను సాధించి, దీనిని స్వాధీనం చేసుకోవడానికి దాడి కూడా చేశారు. కానీ వారి ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆ టైంలో ISIS ఈ విషయంపై అల్-నాబా వారపత్రిక ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో .. యురేనియం సాధించడానికి ఇస్లామిక్ స్టేట్ చేసిన ప్రయత్నాలు విఫలమై ఉండవచ్చు, అయితే భవిష్యత్తులో దానిని సాధీనం చేసుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది.

READ ALSO: Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి మరో సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే!

Exit mobile version