NTV Telugu Site icon

Ishan Kishan: త్వరలో మైదానంలోకి ఇషాన్ ఎంట్రీ.. బరోడా స్టేడియంలో ప్రాక్టీస్

Ishan Kishan

Ishan Kishan

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దాదాపు మూడు నెల‌లుగా ఆట‌కు దూర‌మైన ఈ డాషింగ్ ఓపెన‌ర్ మ‌ళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. మాన‌సిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన అత‌డు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత‌ దేశ‌వాళీ క్రికెట్ తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు దూర‌మైన ఇషాన్ బ‌రోడా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అక్కడి కిరణ్ మోరే అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

Read Also: Tax Distribution : పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?

ఇక, టీమిండియా ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాల‌తో క‌లిసి ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకున్న అత‌డు ఆట‌పై దృష్టి పెడుతున్నాడు అనే ఈ విష‌యాన్ని తాజాగా మాజీ క్రికెట‌ర్ కిర‌ణ్‌మోరె తెలిపారు. అయితే.. ఇషాన్ మ‌ళ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్ ఎప్పుడు ఆడుతాడు? అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇక, ఐపీఎల్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల ఆడిన ఇషాన్.. టీమిండియా ఓపెన‌ర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో వ‌రుస‌గా నాలుగు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించాడు. కానీ, వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 స్క్వాడ్‌లో ఈయంగ్ ప్లేయర్ కు అవకాశం ద‌క్కినా.. శుభ్‌మ‌న్ గిల్ ఎంట్రీ ఇవ్వడంతో బెంచ్‌కే ఫిక్స్ అయ్యాడు. ఆ త‌ర్వాత‌ సౌతాఫ్రికా టూర్ కు ఎంపికైనా సిరీస్ మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు.

Read Also: Ashika Ranganath: ట్రెడిషనల్ డ్రెస్ లో హోయలు పోయిన ఆషిక రంగనాథ్…

అయితే, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ స్క్వాడ్‌కు సెలెక్టర్లు ఇషాన్ కిషన్ ను పట్టించుకోలేదు.. దీంతో ధ్యానం చేస్తున్న వీడియోను ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్‌ చేసి స‌రిపెట్టుకున్నాడు. దాంతో అత‌డు మ‌ళ్లీ జ‌ట్టులోకి ఎప్పుడు వ‌స్తాడు? అని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఇదే విష‌య‌ంపై టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ఇషాన్ ఎప్పుడు వ‌చ్చినా జ‌ట్టులోకి తీసుకుంటాం.. కాక‌పోతే అత‌డు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉందన్నారు. వ‌చ్చే నెల‌లో ఐపీఎల్ 17వ సీజ‌న్ ఉన్నందున ఆ లోపు ఇషాన్ క‌మ్ బ్యాక్ చేస్తాడ‌ని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.