Ishan Kishan Marriage Update: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. టీమిండియా వరల్డ్ కప్‌ను ముద్దాడిన తరుణంలో.. క్రికెటర్ల ప్రియురాల్లు స్టేడియంలో హల్ చల్ చేశారు.. హగ్గులు, ముద్దులు.. ఇలా సందడిగా మారడంతో.. వాళ్లు ఎవరు? వీళ్లు ఎవరు? వారి పెళ్లి ఎప్పుడు ? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పెళ్లి గురించి తాజాగా కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ICC Men’s T20 World Cup విజయోత్సవాల అనంతరం ఇషాన్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది. మ్యాచ్ అనంతరం ఆయన తన స్నేహితురాలు అదితి హుండియాతో కలిసి సంబరాలు జరుపుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వచ్చే ఏడాది పెళ్లి..?
ఇషాన్ కిషన్ తాత మీడియాతో మాట్లాడుతూ తన మనవడి పెళ్లి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఒకసారి తన మనవడితో మాట్లాడినప్పుడు, అతని పెళ్లి వరకు జీవించి ఉండాలని కోరుకున్నానని చెప్పారు. దానికి స్పందించిన ఇషాన్ కిషన్ నవ్వుతూ, “నేను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాను. కానీ, నా బిడ్డ పుట్టే వరకు నువ్వు బతికి ఉండాలి. అప్పుడు అతనికి నీ ఒడిలో ఆహారం పెట్టాలి” అని చెప్పినట్లు ఆయన తాత తెలిపారు.
వివాహ తేదీ ఇంకా నిర్ణయం కాలేదు
ఇషాన్ మరియు అదితి వివాహంపై మాట్లాడిన ఆయన తాత, ఇంకా ఖచ్చితమైన తేదీ నిర్ణయించలేదని చెప్పారు. “వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇషాన్ నాకు ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నాడు,” అని వెల్లడించారు.
అదితి హుండియాతో సంబంధం
ఇషాన్ కిషన్ స్నేహితురాలు అదితి హుండియా రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్. ఆమె 2018లో Miss Diva 2018 టైటిల్ గెలుచుకుంది. అలాగే Femina Miss India పోటీలలో కూడా ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఇషాన్ మరియు అదితి మధ్య సంబంధం 2019లో జరిగిన Indian Premier League సమయంలోనే వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ జంట తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం అభిమానులు ఈ జంట పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
