Isha Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ముఖేష్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కూతురు, రిలయన్స్ రిటైల్ హెడ్ ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చారు. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ- ఆనంద్ పిరమల్ తమ కవల పిల్లలను ఈరోజు స్వాగతించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నవంబర్ 19న వారికి కవలలు జన్మించారని వెల్లడించారు. ఒక పాప, ఒక బాబు పుట్టారని, వారికి ఆదియా, కృష్ణ అనే పేర్లు పెట్టినట్లు తెలిసింది. ఇద్దరూ ప్రస్తుతం బాగున్నారని చెప్పారు.
Indian Army: భారత సైన్యానికి 62,500 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. టెండర్లు జారీ
అంబానీ, పిరమల్ కుటుంబాలు ఈ విషయంపై తాజాగా ఉమ్మడి ప్రకటన చేశాయి. తమ పిల్లలకు జనం ఆశీస్సులు కావాలని కోరారు. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ.. పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్, స్వాతి పిరమల్‌ల కుమారుడు ఆనంద్ పిరమల్‌ను 2018లో డిసెంబర్ 12న వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు.