Site icon NTV Telugu

Jana Nayagan : జననాయగన్ ‘భగవంత్ కేసరి’ రీమేకే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాని తమిళంలో ‘జననాయగన్’ పేరుతో విజయ్ హీరోగా రీమేక్ చేస్తున్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ టీం మాత్రం తమ సినిమా రీమేక్ కాదని చెబుతూ వస్తోంది. ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా తమిళ తంబీలకు, తెలుగు తమ్ముళ్లకు మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరుగుతోంది. అయితే తాజాగా, మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ‘భగవంత్ కేసరి’ నిర్మాత సాహు గారపాటిని అడగ్గా, ‘జననాయగన్’ సినిమా రీమేక్ అని ఆయన వెల్లడించారు. “వాళ్లు ప్రస్తుతానికి ఆ సినిమాని రీమేక్ అని చెప్పడం లేదు.

Also Read:Sakshi Vaidya: ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లో ఆఫర్‌ వచ్చినా.. నేనే తప్పుకున్నా!

కానీ, సినిమా ట్రైలర్ చూశాక అది రీమేక్ అనే విషయం తెలుగు వారికి అర్థమవుతుంది” అని ఆయన అన్నారు. మరి వాళ్లు రీమేక్ అని చెప్పడం లేదు కదా.. క్రెడిట్ ఇస్తారా ఇవ్వరా? లేక వాళ్లది సొంత కథ అని వేసుకుంటారా? అని అడిగితే.. “ఇప్పటివరకు రిలీజ్ అయింది ట్రైలర్ మాత్రమే కదా, ట్రైలర్ లో అన్ని విషయాలు చెప్పలేరు. సినిమాలో మాత్రం కథకు మనకి క్రెడిట్ ఇస్తారు” అని ఆయన అన్నారు. ఇక జనవరి 9వ తేదీన ‘జననాయగన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి ఇది చివరి సినిమా కావడంతో తమిళనాడు వ్యాప్తంగా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా రీమేక్ అనే విషయం ఇప్పుడు తెలుగు హక్కులు అమ్మిన నిర్మాత పేర్కొనడంతో తమిళ తంబీలు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమాకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version