NTV Telugu Site icon

Nikhil : ఒకప్పుడు 100కోట్ల హీరో.. ఇప్పుడు కనీసం ఓపెనింగ్స్ లేవా ?

New Project 2024 11 08t123017.704

New Project 2024 11 08t123017.704

Nikhil : హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్. తర్వాత ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీసు వద్ద 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా కథలో బలం, కృష్ణుడి ఎలివేషన్ తోనే నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యింది. దీంతో సినిమాకి నార్త్ లో విపరీతమైన ఆదరణ వచ్చింది. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన తెలుగు సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘కార్తికేయ 2’ అని చెప్పాలి. దీని తర్వాత నిఖిల్ ‘18 పేజెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తరువాత ఎన్నో ఆశలతో నిఖిల్ ‘స్పై’ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కానీ కథ లోపం వల్ల పెద్దగా ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమాతో నిఖిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.

Read Also:Tejasvi Surya: తప్పుడు వార్తలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఎంపీపై కేసు నమోదు..

సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా, కనీసం ప్రమోషన్ కూడా లేకుండా మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి సెట్స్ పైన ఉండగానే మరో సినిమా ఎప్పుడు ఫినిష్ చేశాడా అని అందరూ చర్చించుకున్నారు. ట్రైలర్ కొంత ప్రామిసింగ్ గానే అనిపించిన ఎందుకనో ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. జస్ట్ కొన్ని ఇంటర్వ్యూలతో ప్రమోషన్లతో మమ అనిపించారు. ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత నిర్మించినా ఎందుకనో అగ్రెసివ్ గా మూవీ ప్రమోషన్స్ చేయలేదు. రిలీజ్ డేట్ కూడా సడెన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఇంటర్నల్ గా ఏమైందనేది ఎవరికి తెలియదు. కానీ ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. జస్ట్ ఛానల్స్ కి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి సరిపుచ్చారు.

Read Also:Alzarri Joseph Banned: కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే రెండు మ్యాచ్లు సస్పెన్షన్‌

సినిమాకు పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమాకి అస్సలు ఓపెనింగ్స్ కూడా రాలేదని టాక్ వినిపిస్తోంది. నిజానికి నిఖిల్ కి రూ.100 కోట్ల వరకు మార్కెట్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఆయన సినిమాలు కూడా ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. అలాంటిది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కూడా ఎంతో కొంత ప్రమోషన్లతో హడావుడి చేసి ఉంటే కాస్త సినిమాకు బజ్ పెరిగేది. నిఖిల్ రేంజ్ కు తగ్గట్టుగా ఓపెనింగ్స్ కూడా వచ్చేవి. మరి ఈ సినిమాని మేకర్స్ ఎందుకు సరిగా ప్రమోట్ చేయలేదనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Show comments