Site icon NTV Telugu

Double Ismart : రామ్ కారణంగానే షూటింగ్ ఆగిపోయిందా..?

Whatsapp Image 2024 04 24 At 11.42.45 Am

Whatsapp Image 2024 04 24 At 11.42.45 Am

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”డబుల్ ఇస్మార్ట్”.. ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.గతంలో వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .రామ్ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .ఈ సినిమాలో రామ్ ఆటిట్యూడ్ ,డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ,పూరి జగన్నాధ్ కెరీర్  మళ్ళీ ట్రాక్ లో పడింది . కానీ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఎక్కువ కాలం నిలువలేదు.ఈ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.అలాగే లైగర్‌ సినిమా తో పూరి జగన్నాధ్ కు బిగ్గెస్ట్ ప్లాప్ ఎదురైంది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరోసారి వీరిద్దరు కలిసారు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ”డబుల్ ఇస్మార్ట్” మూవీని అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేకపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో కూడా క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి రామ్ కారణం అనే ప్రచారం జరుగుతుంది. రెమ్యునరేషన్ పూర్తిగా ఇస్తేనే షూటింగ్ చేస్తానని రామ్ చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వాయిదా వేసినట్లు సమాచారం.ఈ మూవీని రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవడానికి రామ్ ఓకే చెప్పాడట. దీనితో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోవడానికి కారణం కాదని క్లారిటీ వచ్చింది .

Exit mobile version