NTV Telugu Site icon

Pushpa 2 : పోస్టుపోన్ కావడానికి అసలు కారణం అదేనా..?

Pushpa 2

Pushpa 2

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఈ సినిమాను డిసెంబర్ 6 కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

Read Also :Kalki 2898 AD : సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న ప్రభాస్ కల్కి .. రన్ టైం ఎంతంటే..?

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనే ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ చెబుతుండగా అస్సలు కారణం వేరే ఉందని సమాచారం.ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ ఈ సినిమా షూటింగ్ కోసం జనవరిలోనే ఎక్కువ డేట్స్ ఇచ్చారట.కానీ  దర్శకుడు సుకుమార్ ఫహాద్ కు సంబందించిన సీన్స్ చివరిలో తీసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.దీనితో ఫహాద్ డేట్స్ వేస్ట్ అయినట్లు సమాచారం.అయితే మళ్ళీ సరైన సమయంలో ఫహాద్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.

Show comments