MS Dhoni Sacrifice his Long Hairstyle for Deepika Padukone: 2004 డిసెంబర్ 23న ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన ధోనీ.. ఆ తర్వాత 3 మ్యాచ్‌లలో పెద్దగా పరుగులు చేయలేదు. అయితే పాకిస్థాన్‌తో విశాఖ వేదికగా జరిగిన వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 123 బంతుల్లో 148 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ధోనీ పేరు మాత్రమే కాదు.. అతడి హెయిర్ స్టైల్‌కు కూడా భారీ క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే.. మహీ హెయిర్‌స్టైల్‌ను యువత మొత్తం అనుకరించింది.
అప్పట్లో ఎంఎస్ ధోనీ హెయిర్ స్టైల్‌కు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా ఫిదా అయ్యారు. 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ధోనీతో ముషారఫ్ ప్రత్యేకంగా మాట్లాడారు. జుట్టు కట్ చేయించుకోవద్దని, ఈ హెయిర్ స్టైల్‌ను ఇలానే మెయింటైన్ చేయాలని మహీని ముషారఫ్ రిక్వెస్ట్ కూడా చేశారు. అయితే 2007 టీ20 ప్రపంచకప్ విజయానంతరం జులపాల జుట్టును కత్తరించిన ధోనీ.. అందరికీ షాకిచ్చాడు. ధోనీ హెయిర్ స్టైల్‌ను ఎందుకు కట్ చేశాడు అని ఫాన్స్ అందరూ చాలా బాధపడ్డారు.
యావత్ ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఎంఎస్ ధోనీ ఎందుకు కట్ చేశాడన్నది ఇప్పటికీ పెద్ద సస్పెన్స్. అయితే అప్పట్లో ధోనీ హెయిర్ కట్ గురించి రకరకాల ఉహాగానాలు వచ్చాయి. ధోనీ హెయిర్ స్టైల్‌ను కట్ చేయడానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అని రూమర్స్ వచ్చాయి. ఆ సమయంలో దీపికాతో ధోనీ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వెలువడ్డాయి. మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని దీపికా కోరిందట. ఆమె కోరిక మేరకే మహీ హెయిర్ స్టైల్ కట్ చేయించాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు.