Liquor : రైలులో మద్యం తీసుకెళ్లడం భారతీయ రైల్వే ప్రకారం చట్టవిరుద్ధం. మరోవైపు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తీసుకెళితే, పట్టుబడితే మీపై చర్యలు తీసుకోవచ్చు. అయితే మెట్రో, విమానంలో మద్యం తీసుకెళ్లడంలో కఠినత లేదు. కొన్ని నిబంధనలతో మెట్రో లేదా విమానంలో మద్యం తీసుకెళ్లడానికి మీకు అనుమతి ఉంటుంది. దీని కోసం, ప్రతి రాష్ట్రం వేర్వేరు నిబంధనలు, షరతులను కలిగి ఉంటుంది.
రైలులో మద్యం తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధించబడుతుంది. మీరు రైలులో మద్యం తీసుకెళుతూ పట్టుబడితే లేదా రైల్వే ప్రాంగణంలో లేదా రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో లేదా రైల్వే స్టేషన్‌లో మద్యం సేవిస్తూ కనిపిస్తే, అది పూర్తిగా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం మీపై చర్య తీసుకోవచ్చు. అంతే కాకుండా రైల్వే ప్రాంగణంలో మత్తు పదార్థాలు సేవించినట్లు తేలితే 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా విధించవచ్చు.
Read Also:iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!
ఢిల్లీ మెట్రోలో మద్యం రవాణాకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అనుమతినిచ్చిందని టాక్. మీరు మెట్రోలో రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మెట్రోలో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది.. తాగడానికి కాదు. మీరు మెట్రో స్టేషన్ ఆవరణలో, మెట్రోలో మద్యం సేవిస్తూ పట్టుబడితే ఎక్సైజ్ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మీమ్మల్ని ప్రాసిక్యూట్ చేయవచ్చు.
విమానంలో మద్యం తీసుకెళ్లడం లేదా తాగడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో 100 ml వరకు ఆల్కహాల్ తీసుకోవచ్చు. అలాగే విమానాల్లో మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. కానీ మీరు అంతర్జాతీయ విమానాలలో మాత్రమే మద్యం ఉపయోగించవచ్చు. దేశీయ విమానయాన సంస్థల్లో మద్యం సేవించడం అనుమతించబడదు.
Read Also:Rare Brain Infection: కేరళలో అత్యంత అరుదైన అమీబా ఇన్ఫెక్షన్ కేసు.. మెదడును ప్రభావితం చేసే వ్యాధి..