NTV Telugu Site icon

Varun Tej : ఫిదా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందా..?

Fidha

Fidha

Varun Tej : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్,స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “ఫిదా”..ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్ తో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఫిదా సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవి తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.అనతికాలంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Read Also :Amitabh Bachchan : ప్రభాస్ ‘కల్కి’ మూవీపై ప్రశంసలు కురిపించిన అమితాబ్ బచ్చన్..

ఇదిలా ఉంటే ఫిదా కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని సమాచారం.దర్శకుడు శేఖర్ కమ్ముల మరో అద్భుతమైన కధను హీరో వరుణ్ తేజ్ కు తెలిపినట్లు సమాచారం.శేఖర్ కమ్ముల కథ చెప్పిన వెంటనే వరుణ్ తేజ్ ఒప్పుకున్నట్లు సమాచారం.అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల స్టార్ హీరో ధనుష్ హీరోగా “కుబేర” సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో బిజీ గా వున్నారు.వీరిద్దరి సినిమాలు పూర్తి అయిన వెంటనే వీరి కాంబోలో సినిమా మొదలు కానుందని సమాచారం.

Show comments