ఆసుపత్రిలో చేరిన ఒక గంటలోపు నగదు రహిత క్లెయిమ్ లను, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీలను తాజాగా ఆదేశించింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆరోగ్య బీమా కోసం ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. ఆరోగ్య బీమా సేవల సామర్థ్యం పారదర్శకతను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ సర్క్యులర్ లోని ముఖ్యాంశాలు పాలసీదారులు, బీమాదారుల కోసం చాలా ముఖ్యమైన నిబంధనలను కలిగి ఉన్నాయి. నగదు రహిత క్లెయిమ్ లను వేగంగా ప్రాసెస్ చేయడం అనేది కీలకమైన ఆదేశాలలో ఒకటి. భీమాదారులు ఇప్పుడు నగదు రహిత అధికార అభ్యర్థనలను ఒక గంటలోపు ఆమోదించాలని పేర్కొంది.
Viral Video: సీపీఆర్ చేసి కోతి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్..
అంతేకాకుండా, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తుది పక్రియను ఆసుపత్రి అభ్యర్థన చేసిన మూడు గంటలలోపు పూర్తి చేయాలని సర్క్యులర్ లో ఉంది. రోగులు క్లెయిమ్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, అలాగే సాగదీసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఇది పనికి వస్తుంది. దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణించిన సందర్భంలో, దుఃఖంలో ఉన్న కుటుంబానికి ఆసరాగా., ఎలాంటి ఆలస్యం లేదా సమస్యలు లేకుండా చూసేందుకు భీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని IRDAI ఆదేశిస్తుందని సర్క్యులర్ లో నివేదించింది.
వీటితోపాటు, పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా తమ పాలసీలను రద్దు చేసుకునేందుకు పాలసీదారులను సర్క్యులర్ అనుమతిస్తుంది. అటువంటి సందర్భాలలో, వారు గడువు ముగియని పాలసీ వ్యవధికి ప్రీమియం రీఫండ్ కు అర్హులు కూడా. ఒకవేళ పాలసీదారులు తమ పాలసీని ముందుగానే రద్దు చేయాలని ఎంచుకుంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలా ఇది దోహద పడుతుంది. భీమా అంబుడ్స్‌మన్ అవార్డు అనేది బీమా చేసిన వ్యక్తి నుండి ఫిర్యాదును స్వీకరించిన మూడు నెలల్లోపు బీమా అంబుడ్స్‌మన్ తీసుకునే నిర్బంధ నిర్ణయం. అంబుడ్స్‌మన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. అలాగే వివాదం యొక్క వాస్తవాల ఆధారంగా న్యాయమైన సిఫార్సును అందిస్తుంది.
ఇక మొత్తంమీద, IRDAI యొక్క మాస్టర్ సర్క్యులర్ భారతదేశంలో ఆరోగ్య బీమా పాలసీల సమర్థత, పారదర్శకత, న్యాయబద్ధతను మెరుగుపరచడానికి వివిధ చర్యలను పరిచయం చేసింది. ఈ దశలు పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, మరింత ప్రతిస్పందించే జవాబుదారీగా ఉండే ఆరోగ్య బీమా వ్యవస్థను నిర్ధారించడానికి రూపొందించబడ్డాయి.