Site icon NTV Telugu

Israel – Iran War: షాకింగ్.. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

Iran Defense Minister Aziz Nasirzadeh

Iran Defense Minister Aziz Nasirzadeh

Iran Defence Minister Aziz Nasirzadeh Killed in US–Israel Strikes: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి చెందారు. అజీజ్‌ నాసీర్‌జాదే మృతి చెందాడని రాయిటర్స్‌ కథనం వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అమీర్‌ హతామీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ సైతం మృతి చెందినట్లు రాయిటర్స్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్‌ నాసీర్‌జాదే మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. అయితే.. ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ చనియారన్న వార్తలపై ఇరాన్ స్పందించింది. “ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ సురక్షితంగానే ఉన్నారు. ఆయన తన విధులను యథావిధిగా నిర్వహిస్తున్నారు” అని ఇరాన్ సైనిక వర్గాలు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. టెహ్రాన్‌పై జరిగిన క్షిపణి దాడుల్లో హతామీ మృతి చెందినట్టు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. అయితే.. ప్రస్తుతం రక్షణ మంత్రి విషయంలో మాత్రం ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

READ MORE: Dr. Dattatreyudu Nori : మహిళా ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ముందడుగు.. ఉచిత HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ పై డా.దత్తాత్రేయుడు నోరి విశ్లేషణ

Exit mobile version