Site icon NTV Telugu

Pv Sunilkumar: ట్విట్టర్లో సునీల్ కుమార్ ఆసక్తికరవ్యాఖ్యలు

Pv Sunil Kumar

Pv Sunil Kumar

పీవీ సునీల్ కుమార్.. ఏపీ పోలీస్ శాఖలో నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను బదిలీ చేశారు. ఏపీ స్టేట్ డిజాస్టర్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీ సంజయ్‌కు ఏపీ సీఐడీ బాధ్యతలు ఇచ్చారు.. జీఏడీకి రిపోర్టు చేయాలని సునీల్‌ కుమార్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. తన బదిలీపై పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. ట్వీట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్.

సునీల్ కుమార్ ట్వీటుపై పోలీస్ వర్గాల్లో చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. తాను డీజీపీ కాబోతున్నాననే సంకేతాలను పరోక్షంగా సునీల్ ట్వీట్ ద్వారా చెప్పారనే పోలీస్ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఐపీఎస్ సునీల్ కుమార్ ట్వీట్ ఎలా ఉందంటే.. డీజీపీగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీని విడిచిపెడుతున్నా. సీఐడీలో మూడేళ్ల అద్భుతమైన, మరపు రాని ప్రయాణం చేశాను. సీఐడీలో నాకు డీజీపీగా ఎలివేషన్ వచ్చింది. అవకాశం కల్పించి నా కర్తవ్య నిర్వహణలో పూర్తి సహకారం అందించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు సునీల్ కుమార్.

Exit mobile version