Site icon NTV Telugu

IPL Retention 2025: గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి బిగ్ అప్‌డేట్.. కెప్టెన్ అతడే!

Gujarat Titans

Gujarat Titans

ఫ్రాంఛైజీల విజ్ఞప్తి మేరకు ఈసారి ఆర్‌టీఎంతో కలిసి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఐపీఎల్ పాలక మండలి అనుమతిని ఇచ్చింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలి. గడువుకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో కొన్ని జట్ల రిటైన్ లిస్ట్ బయటికి వస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్‌ నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ ఫ్రాంఛైజీ రిటైన్‌ చేసుకుందట. గిల్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ను కూడా రిటైన్‌ చేసుకుందని ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి.

‘ఐపీఎల్ 2025లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఉంటాడు. రషీద్ ఖాన్‌ అతని కెప్టెన్సీలో ఆడతాడు. పెద్ద జట్లు గిల్ వేలంలోకి రావాలని కోరుకుంటున్నాయి. గిల్ మాత్రం గుజరాత్‌ జట్టులోనే ఉండాలనుకుంటున్నాడు. మేం బలమైన జట్టును నిర్మిస్తాం. జట్టులో మంచి ఆటగాళ్లు ఉంటారు’ అని గుజరాత్ టైటాన్స్‌ ఫ్రాంఛైజీ వర్గాలు ఓ జాతీయ మీడియాకు తెలిపాయి. సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, మహ్మద్ షమీలను కూడా రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. షమీ కోసం ఆర్‌టీఎంను ఉపయోగించుకోనుందట.

Also Read: Realme GT 7 Pro Launch: రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే!

ఐపీఎల్‌ 2024కు ముందు హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి.. తిరిగి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో గుజరాత్ మేనేజ్మెంట్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. కీలక ఆటగాళ్లు దూరమవడంతో 2024 సీజన్‌లో గుజరాత్ పాయింట్ల పట్టిక లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లలో ఐదు విజయాలను సాధించి.. ఏడు ఓటములను చవిచూసింది. గిల్ సారథ్యంలో గుజరాత్‌ ఫ్రాంచైజీ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే గిల్ 426 పరుగులు సాధించాడు.

Exit mobile version